Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేషము 55 దగ్గరనుంచి ముప్పై ఏండ్ల వరకు వున్న విలానవతులు! కార్లు పెండ్లిండ్లు చేసికోవడం స్వాతంత్ర్యానికి భంగకరమని పూర్ణం గా నమ్మిన పూవుబోడులు. ఈ జట్టుకు నాయకురాలు మార్గరెట్టు సల్లివాన్ ముప్పైఏండ్ల పడుచు ! ప్రపంచంలోకల్లా అందమైన దేశం హిందూ దేశమని ఆమె నమ్మకం. హిమాలయపర్వతం. సాలిమార్ తోటలు, తాజమహల్, అజంతా వీని అన్నింటికి తలమాణిశ్యం గాంధీ మహాత్ముడు... ఇవి చాలవా, ప్రపంచా నికి ఒక దేశాన్ని నాయకమణిగ చేయటానికని ఆమె వాదన. బొంబాయినుంచి తిన్నగా శివగ్రామానికి వెళ్ళి వారు గాంధీగారి ఆశ్రమానికి చేరుకున్నారు. పదిహేనురోజు లా ఆశ్రమంలో, ఆశ్రమవాసులందరితోపాటు ప్రార్థన సమయా నికి ప్రార్థనకు వెళ్ళుతూ, అప్పుడప్పుడు గాంధీమహాత్మునితో సత్యాగ్రహం, ప్రేమ, సంతాన నిరోధం, యూదులు,ప్రపంచ యుద్ధం, భారతజాతీయత, భగవద్గీత మొదలైన విషయాలను గురించి ఆ అవతారపురుషుని అభిప్రాయాలు చూరగొంటూ కాలం గడిపారు. “వృత్తి ఆధారవిద్య"ను గురించి తెలుసు కున్నారు. మగన్వాడి, నల్వాడి, విద్యా-మందిరం మొదలైన ప్రదేశాలకు తీర్ధయాత్రలు సాగించి, ఆ తెల్ల స్త్రీలు గాంధీ మహాత్మునిషహ తత్వాన్ని అర్థంచేసుకొ నేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఆ పదిహేను రోజులూ ఆ ఆ శమ వాసులూ ఇతర గాంధీశిష్యులు వాళ్ళకు చూపించిన గౌరవం, మర్యాద వాళ్ళహృదయాలను ద్రవింప చేశాయి,