54 బాపిరాజుకథ లు ఇలాంటి ఇనుము నిప్పుల విశ్వేశ్వరరావుకి ఒక్క టే నీరసగుణంవుంది. శిల్పమన్నా, చిత్రలేఖనమున్నా, సంగీత మన్నా గబగబ వెళ్లే అడుగు ఠక్కున ఆగిపోతుంది, క్రిందికి తిరిగివున్న పెదవుల రేఖలు ఒక్కొక్కప్పుడు ఒక వైపునా, ఒకొక్కప్పుడు రెండువైపులా ప్రసరించి, అతని మొహాన్ని వెన్నెలచేస్తవి. వేసంకాలపు మధ్యాహ్నంనాటి అతని జీవితం మాఘపూర్ణి మనాటి నిశిరాత్రి ఔతుంది. ఎల్లోరాలూ, అజం తాలూ చూనూ ఆంగ్లేయులని ద్వేషించవలసిన కాలమంతా,కళలలో మునిగి వృధాపుచ్చటం తప్పని వాదించుకుంటాడు. గాని, కళలమధ్య ప్రతిహింసా త్మక కలలు బాగా కనవచ్చనీ సమాధానం చెప్పుకుంటూ దక్షిణాదినివున్న గుళ్ళూ గోపురాలూ, శిలలూ, శిల్పాలూ, విగ్రహాలూ, వితానాలూ, చెక్కడాలూ, చిత్ర లేఖనాలూ దర్శనంచేస్తూ గడుపుతున్నాడు జీవితం విశ్వేశ్వరరావు. 4 బొంబాయి పట్టణంలో అలెగ్జాండ్రా రేవులో పి. అండ్ ఓ కంపెనీవారి క్లియోపాత్రా అనే పెద్దఓడ వొడ్డుకు వచ్చి చేరింది, మెట్లు దింపినారు, ఓడలోనుంచి క్రిందికి మొట్టమొదట ది. సవారు పదిమంది ఆంగ్ల స్త్రీలు. హిందూ దేశ విచిత్ర కళాసౌభాగ్యాన్ని దర్శించి చూరగొని పోదామని జట్టుగ వారందరూ ఈ శీతకాలంలో బొంబాయిపట్టణంలో అడుగు పెట్టారు. అందరూ ఉన్నత కుటుంబాలకు చెందినవారే! చదువుకున్న వాళ్ళు ఇర వై ఏండ్ల
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/56
స్వరూపం