Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేషము 53 న్నవి. కూలీలపై ఆడుతున్నవి. చదువుకొని ఉదోగ్యం లేని యౌవన వయస్కులను పీల్చి పాలిపో చేస్తున్నవి. అతని ఆస్తి పెద్దది కాకపోయినా, ఆకారం పెద్దది. అందం లేని జీవితమైనా మూర్తిమాత్రము ఆర్యజాతి రేఖలు పుణికిపుచ్చుకొన్న సౌష్టవం కలిగిన సౌందర్యము. కళ్ళల్లో తాలిమి లేదు; హింసాకాంతులు కృత్తికానక్షత్రయు క్త సూర్యునికిర ణాలతీర్ణతతో కనురెప్పలమీద తాండవిస్తుంటవి. జైలులో వున్నన్నాళ్ళూ చక్కగా చదువు మాత్రం నేర్చుకొన్నాడు ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లీ షు భాషలూ, ఉరుదూ అరవం భాషలూ మంచినీళ్ళ ప్రాయం చేసుకొన్నాడు. అన ర్దళధారతో మాట్లాడుతాడు. వ్రాస్తాడు. ఖైదునుంచి రాగానే చక్కనిపిల్ల నొకదాన్ని కట్ట చెదిరినమనసు కుదుటపడుతుందని, మంచి సమ్మం థాలు రెండుమూడు తీసుకువస్తే, విశ్వేశ్వరరావు—ఇష్ ఇష్ అన్నాడు. 3 అతని జన్మమంతా నిండిపోయిన కోపానికి విరుగుడు క నపడటం లేదు. ఏం చెయ్యాలో అతనికి తోచటం లేదు . తన బోటివారిని పదిమందిని కలేసి, ఒక పార్టీ చేదామను కున్నాడు. నడపబడేవారూ లేరు, నడిపే మొనగాడూ లేడు. పదిమందిలోనూ తనకున్న భావాలు గట్టిగా మాట్లాడటానికి వీలు లేదు. తెల్ల వాళ్ళ బానిసత్వప్రచారానికి గాంధీ మహా త్ముడు ప్రధాన వ్యాసంవంటివాడనుకొన్నాడు.