Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 మంత్రివర్గాలు బాపి రాజు క థ లు ఏర్పాటయిన వెనక, రాజకీయబంధితు లందరూ బోనల్లోంచి ఎండిపోయిన శివంగుల్లా వచ్చారు. అం . రూ సత్యము, అహింసలయందు తమకు నిశ్చల మైన నమ్మకం కుదిరిందని శపథం చేసే బయటకు వచ్చారు. కాని కొందరికిమాత్రం వాళ్ళ హృదయాల్లో ద్వేషందాగే వున్నది. కొందరు దాచుకున్నారు. ఆ దాచుకొన్న వాళ్ళల్లో విశ్వేశ్వరరావొకడు. అనేక ఖైదులు చూచాడు. అనేకరకాల కూళ్ళు కుడి చాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. అర్ధబేడీల్లో, నిలువు బేడీల్లో, గోడ కుర్చీల్లో, చీకటికొట్లల్లో పిశాచరూపాలు దాల్చాడు. పై పెదవి పైకిపోగా, క్రింది పెదవి క్రిందికిపోగా, ముక్కుపుటాలు విస్ఫారితం కాగా, కళ్ళు కాయలు కాచి పోగా, “ఖా-ఖా" అని బుసలుకొట్టాడు. ఉపవాసవ్రతాలు చేశాడు; బలవంతంగా ద్రవాహారం ఇచ్చారు; కొనఊపిరితో బయటపడుతూ ఉండేవాడు. అతనిహృదయంలోని దవానలం గాంధీమహాత్ముని చల్లనిమాటలతో చల్లార లేదు; ఇంటిదగ్గర తనవాళ్ళ ప్రేమ చూపుల్లో మాయమైపోలేదు. రైల్లో బిచ్చగాళ్ళు, ఋణవిమోచన చట్టం, గాలి వాన, పొలాల వరదలు, ఎగిరిపోయిన యిళ్లు, చచ్చిపో. యిన జంతువులు, అన్నీ తెల్లని పాము ఛాయలే. ఈ తెల్లనిపాము భరతదేశం అంతా నిండింది. దానికి లక్షలు లక్షలు నాల్కలు. చిన్న పిల్లాళ్ళని రుచిగా నాకుతు