50 బాపిరాజు థ లు ఆ యువకుడు అచిత్రం పూర్తి చేసి తన పేరు దానిమీద లిఖించుకొని, వెనక్కు వెళ్ళి చిత్రాన్ని చూచి, కళ్లు సన్నగిల్ల బొమలు ముడివడ, పళ్ళు పటపటమని కోరుక్కున్నాడు. విశ్వేశ్వరరావు ఆవేశహృదయుడు. చిన్నతనాన్నుంచి అతనికి దేశభక్తి విశేషం. గాంధీమహాత్ముడు 1919లో అహింసామహాయజ్ఞం – భారతమాత దాస్యశృంఖలావిమోచనార్ధం ప్రారంభించిన రోజుల్లో విశ్వేశ్వరుడు పదేళ్ళ బాలుడు. అప్పటికే అతనికి తాను ఆంధ్రుణ్ణనీ, బానిస అయిన భారతీయుణ్ణనీ, గాఢభా నాలు మూర్తి మూర్తంతా వ్యాపించిపోయినవి. అతనిహృదయం ఆంగ్లజాతిపై ద్వేషంతో నిండిపో యింది. అతనికి ద్వేషం ద్వేషం మోముమీద మోముమీద మచ్చలా వున్నది. చిన్న బిడ్డగుణం వచ్చినప్పుడు కాల్చగా వచ్చిన మచ్చలా వున్నది. ఎక్కడ చూచినా ప్రత్యక్షమయ్యే దారిద్ర్యం, అనా గరకతా, అనారోగ్యపు పరిసరాలూ తెల్లవాడు తెచ్చి పెట్టిన మహాభిక్ష అని అతని నిశ్చితాభిప్రాయం. కర్కశహృదయంతో, స్వలాభాపేక్షతో ఈఇంగ్లీషు బందిపోటు భారతీయత, ఐశ్వర్యము నాగరికతా తరలిం చుకుపోయినట్టు అతని చిన్న హృదయానికి గోచరించింది. పాఠశాలలు విడచి బయటకు రావలసిందని మహా త్మాజీ ఆదేశం ఇవ్వగానే బడికి వెళ్ళనని పట్టుపట్టి రాజకీయ సభలకు పోవడం, స్వచ్ఛందభటులతో తిరగడం ప్రారంభిం చాడు గాంధీగారిబోధలు అతని చిన్నహృదయానికి అర్ధం
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/52
స్వరూపం