Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వేష ము 4.9 అంకితము : ప్రేమణావ సోమ శేఖరశర్మకు గాలింగనంతో [ఈ కథా, ఈ కథలోని పాత్రలు కేవలం కల్పితాలు. ] ఆవేశంలో ఆ చిత్రము లిఖిస్తున్నాడు. రంగులు కలప డంలో, కుంచెలు రంగుల్లో ముంచడంలో, కుంచెలతో కాగితంమీద చిత్తరువు చిత్రించడంలో అతివేగము. ఆ చిత్రంపేరు “రోడ్డు రోలరు. సియన్నా, పెయస్ . సుగే, నీలిమందు, సిన తమస్సును కలిగినవి. రంగులు, అంబరు, క్రిముసన్ లేతు కలి రేఖలు అసాధువులు, కర్కశాలు; రూపాలు వికృ తాలు, భయంకరాలు. హెచ్చుతగ్గులుగా ఉన్న రోడ్డు ఆరోడ్డును సమం చేయ డానికి భారతీయ నరనారీమణులు, రాళ్ళు - శిశువులూ, వృద్ధులూ, వికృతాంగులూ. ఆ రాళ్ళమీదనుంచి రోడ్డు రోలకు నెమ్మదిగా, నిదానంగా అత్యధికమైన చప్పుడు చేస్తూ వెడుతున్నట్లున్నది. ఆ రోలరుబండినడిపేవాడు నల్లటి ఎత్తుటోపీ బ్రిటిషు రాజ్యతంత్రజ్ఞుడు. రోడ్డుకు ఈవలావల ఉన్న భారతీయులను ఆంగ్లయుద్ధభటులు, ఆంగ్లవర్తకులు, ఆంగ్ల మిషనరీలు కఱ లతో రోడ్డుమీదపడేటట్టు నెట్టుతున్నారు. బండి వెనక భాగం రక్తమయం. కట్టి &