ఈ పుటను అచ్చుదిద్దలేదు
48 బాపి రాజు థ లు "ఆపిల్లవాడు నాకు నాకు తమ్ముడు చిన్న తనం నుంచి పెంచుతున్నా. “నాకూ తమ్ముడే; నాబిడ్డడే అవుతాడు. ఇక్క ణ్ణుంచి నేనూ పెంచుకుంటా.” వరి "" శుభముహూర్తంలో ఆ నక్షత్రాలే సాక్షిగా, పక్కన ప్రవహించే గోదా నీరుసాక్షిగా, వాళ్ళిద్దరూ ఆ భార్యాభర్తలయ్యారు. ఒకళ్ళ కౌగిలింతలో ఒకళ్ళు కలసి మెలిసి కరిగిపోయారు ఆ పసిపిల్లవాడు హృదయంతో 'తథాస్తు' అని నవ్వు కున్నాడు.