Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 46. ఆ రోజు సాయంత్రం కాల్వగట్టున వంట చేసుకుంటూ వుంది. పిల్లవాడు చితుకులు ఏరి తెచ్చి యిస్తున్నాడు. ఆ సమ యంలో ఆ సంధ్యాగుణకాంతుల్లో ఒక పురుషుడు ఆ చెట్లు కిందికివచ్చాడు. అతని మొహం చిరునవ్వులు నవ్వుతూ ఉంది. కళ్ళులేని ఆ కబోది చెవులు, శరీరం యావత్తూ అతిసున్నిత మైన గ్రహణశక్తి సంపాదించుకున్నవి. ఆ కొత్తమనిషి రాక కనిపెట్టింది. “ఒరే ఎవర్రా ఆ వచ్చింది!” ఆ పిల్లవాడు ఆ మనిషి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళాడు. కుంటి చెయ్యి చూశాడు, పిల్లంగోవి చూశాడు. “ ఆరోజు మనిషి ” ఆ పిల్ల గ్రహించింది. ఆమె తెల తెలిపోయింది. గుండె కొట్టుకుంది. తలవాల్చుకుని వంట చేస్తూ నేఉంది. ఆ మనిషి పిల్లంగోవి తీశాడు. "ఏదిర లక్ష్మణ సీత, వర్ణశాలాలో లేదెందు శాత___ " అనిపాటపాడినాడు. ఆ తేనె చుక్కలధ్వని ఆ సంధ్య అంతా ఆక్రమించుకుంది. ఆ పిల్లవాడు అతనిదగ్గరగా జేరి మొహంచూస్తూ కూచున్నాడు. ఆ అమ్మాయి వంట చేస్తూనే వుంది. “రారోరిచిన్నవాడా, మావాడా రారోరి చిన్న వాడా --"