Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6] 5 45 ఆ గుడ్డిపిలకు జ్ఞానంవచ్చినప్పటినుంచీ ఇల్లా ముష్టి ఎత్తుకుంటూ రైలు పక్క గ్రామంలో ఒక బహు కుటుంబీకుడు, మంచి అంతఃకరణగల ఒక రైతు ఇంటిలో ఒక పంచను వుంటూ వుండేది. ఊళ్ళో ఒక పెద్దసంసారి తనపిల్లకు సంగీతం నేర్పిస్తూ వుండే వీధివాకిట్లో కూర్చుని సంగీతం చెవులార వినేది.. ఇల్లా ఏకలవ్యుడుగా అద్భుతమైన గ్వా విద్య సంపాదించుకుంది. ముష్టి బాగావచ్చేది. ఆ డబ్బుమహాయిల్లా లైన రైతు భార్యకు దాచయిచ్చేది. పెద్దదవుతూన్న కొద్దీ ఏదో భయం, సిగ్గు కలుగుతూ వుండేవి. ముష్టికితిన్నగా వెళ్ళక ఇదివరకు పోగు చేసుకున్న డబ్బులు కర్చు చేసుకొని గంజికాచుకుంటూవుండేది. తల్లి ఎవరో తండ్రిఎవరో, ఎల్లా ఆ రైతు ఇంట్లో చేరిందో ఆ పిల్లకు ఏమీ తెలియదు. ఒకరోజున చేబ్రోలు ముష్టికిపోయి మధ్యాహ్నం కాల్వగట్టున వంట చేసుకుంటూవుండగా, ఒక పసిపిల్ల వాడు మూడేళ్ళవాడు. ఆ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. ఎక్క ణ్నుంచి వచ్చావో! ఆ గుడిపిల్ల అతన్ని వళ్లోకి తీసుకొంది. అప్పట్నించి వాళ్ళిద్దరూ, ఒకతల్లి బిడ్డల్లా ఆయ్యారు. అతడు దారిచూపించడం, ఆమె పాటపాడడం అ నాలు గేళ్ళు గడిచినై,