Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 బాపి రాజు x లు టిలో దాచుకున్న డబ్బు ఎవ్వరో మటుమాయం చేశారు. ఉద్యోగం పోయింది. పెండ్లి లేదు. దాంతో అతనికి మతి పోయింది. దిక్కు లేనివాడికి దేవుడుకాదు, తిరిపెమే దిక్కు. బిచ్చగాళ్ళకు కొందరు గురువులు వుంటారు. అతడు ఓ గురువుదగ్గర పిల్లంగ్రోవి బాగాపూవడం. అందువిూద వేదాం తంపాటలు, భక్తి పాటలు పాడడం నేర్చుకున్నాడు; రైలు బిచ్చం సాగించాడు. ఆ రైలేగా ద్రోహంచేసింది! ఆ వచ్చిన డబ్బుతో కాఫీ హోటల్లో తినడం,కలుపాకదగ్గర గౌళ్ళపుల్లమ్మకూతురు పోసే ధవళసుధారసం గళ్ళ గ్రాహంగా సేవించి, సింధూరా నిమిష త్వం, మహాయోగంలో మైకం సంపాదించి టాడు. అమరుడౌతుం అలాంటివాడు ఆ గుడ్డిపిల్ల పాట విన్నాడు. అతని మొఱటు మనస్సు గాలిలో వూగిపోయింది. దోహదం చేసిన మొండి చెట్టు వికసించినట్లు చిగురు దాల్చింది. ఏ ఆవేశమో అతనికి తెలియదు. అతనికి కళ్లు నీళ్లు తిరిగినై. మనుష్యులచంచలత్వమూ, కఠినత్వము చూస్తే ఆత నికి అసహ్యం వేసింది. ఎవ్వరూ తియ్యకుండా, ఆ గుడ్డిపిల్లను నిరసించగానే, అతడు ముట్టెవఁచిన కారుదున్న అయిపోయి నాడు. తాను పొద్దుట్నుంచి పోగుచేసుకున్న అరణాలడబ్బు లూ ఆ అమ్మాయి చేతిలో వేసి, రైలు ఆగగానే దిగి చక్కా పోయాడు. ఆ అమ్మాయికి ఇంత డబ్బు ఎవరిచ్చారో తెలవలేదు. “దేవుడులాంటి దయగల ప్రభువు ఎవరిచ్చారో !” అనుకున్నది.