Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడ్డి పిల్ల ఆ 43 యిరికి కూలబడ్డారు, ఒదిగిపోయారు. చూవులేని ఆ బాలిక కళ్ళు, చూపుపుట్టని ఆ పిల్లవాడిహృదయం ఒకటికొంటి ఆలింగనం చేసుకొన్నవి. ఆ బాలకుడు కంటినీరు ఆ బాలిక చేతులు అద్దుకుని ఆపుకోపోయాడు. 4 ఆ బాలిక పాట ప్రారంభించక పూర్వమే ఒకవ్యక్తి ఆ రైలుపెట్టె ఎక్కాడు. అతడూ రైలుబిచ్చగాడే -- ఒక చెయ్యి లేదు. ముప్పైయేళ్లుంటాయి. చింకిగుడ్డా, చిరిగిపోయిన -తో ఒక పిల్లంగోవి ఎడం చేత్తో పట్టుకుని రైలు ఎక్కాడు. అప్పుడే ఆ బాలిక తన దివ్యగానం అలాపన చేసింది. తర్వాత జరిగిన కథ అంతా చూస్తూనేవున్నారు. ప్రపంచం అంటే కోపంగలమనిషి. వెనక రైల్వేపోర్ట గుగావుండి రైలుక్రింద పడిపోయి చేయి పోగొట్టుకున్నాడా బిచ్చగాడు. నా అనేవారు లేకుండా ఉండేవాడు. జీతంలో వచ్చిన నాలుగు రాళ్ళు మిగుల్చుకుంటూ గూడ్సు స్టేషనులో అప్పుడప్పుడు దొంగతనం చేసిన వస్తువులు అమ్మగా వచ్చిన డబ్బూ, రైలులోంచి దిగిన ప్రయాణీకుల సామాను మోయ డంవల్ల వచ్చిన కూలి, టిక్కెట్టు లేని వాళ్ళను ఇంజను దగ్గర నుంచో, గార్డు పెట్టిదగ్గరనుంచో పోనిచ్చినందుకు లంచం మామూళ్ళు అంతా కలిపి నూరు రూపాయలు మూట కట్టాడు. ఇంతట్లో చెయ్యిపోయిన దుకు, రాజమండ్రి రైల్వే ఆస్పత్రిలో మూడు నెలలు వున్నాడు. అప్పుడు తాను ఇం