5] నాగరాజు 37 ఏ ప్రక్క నుంచి నస్తుంది? పూర్వసంప్రదాయాలన్నీ త్యజించి, హేయమైన నూత్న ఫక్కీలు సృజించాడు, గాంధర్వస్మృతి దోషుడయిన ఇతనికి మరణ మేశిక్ష” అని ఊరుకొన్నాడు. ఆమాటలకు తా హాహాకారంచేశారు. ఆ పరాయి దేశంమనిషి వణికిపోయాడు. దీనంగా అతని కేసి చూశాడు. తలవాల్చి ఒక నిమేషం ఆలోచించాడు. బుస్సుమని నిట్టూర్పుపుచ్చాడు. ఇంతలో ఆ పరాయి దేశ్య మనిషి క్రోధ మూర్తిఅయ్యాడు. చూస్తుండగా, అతడు కరిగిపోయాడు. దేహమంతా, తెళుకుతళుకుల పొడలున్న సర్ప దేహమయింది. మనిషి తల మాయమయింది. ఎఱ్ఱజీరల నాలుకల ఆడిస్తూ మూడుఫణాలు ఛత్రా లయ్యేటట్లు ఆడిపోయినవి 4 తేజస్సునిండిన మోములో చిరునవ్వులు 66 తాండ వించగా, ఆ బాలకుడు కాటుకై సూర్యకిరణంలాంటి తన చేయి ముందుకు చాపాడు. ఆరుధనువుల పొడవై దేహం ఆడి చుట్టలు చుట్టుకొంటూండగా బుస్సుమని, ఆ నాగరాజు పడ గలు వెనకకుపోనిచ్చి, మెరుపులా కాటువేయబోయే చిటి కలో లోకాలుకదిపే తీగ పాటలస్వనంలో “ఆగు” అని మాటలు వినబడ్డాయి. ఆ మండపంమీద ఒక స్తంభాన్ని అనుకోని దినదినమూ పాట వినడానికివచ్చే ఒక బాలిక దివ్య సౌందర్యగాత్ర పద్మంలాంటి చెయ్యి చాపి, నాగరాజును ఆగుమని సన్న చేసింది. శృతులన్నీ మురిసిపోయే చూపులతో
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/39
స్వరూపం