Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగరాజు 35 తుంటే, పేరుపొందిన గాయకులు, వైణికులు వినటానికివచ్చి, దినదినం ఆ పట్టణంలోనే నిల్చిపోయేవారు. సహజసంగీతరసో దేశంకల యువజనులు ఆతనిపాటలు విని, ఆయన్ని గురువుగా యెంచుకొని, ఆమోస్తరుగా వీలు మేళవించి, ఇళ్ళదగ్గిర సంగీతం నేర్చుకుంటూ ఉండేవారు. అక్కడికి ఒక పరాయి దేశంమనిషి వచ్చి భయం కరంగా ఆకర్షించే కెంపుకళ్ళతో, ఊగిపోతూ పాట వినే వాడు. ఆతని ఆకుపచ్చని తళుకుపంచెకూడా ఆ సంగీతం వినేటటే కనబడేది. 2 ఒక సంధ్యాకాలంలో— ఆ వీణాధరుడు హాయిమను కొత్తపాట ఒకటి మోహనమైన గాత్రంకలిపి తీగలపై మ్రోగించినాడు. సభ్యులందరూ పరవశులై పోయినారు. చిరునవ్వుతో ఆ పాటకాడు అందరినీ చూచి, పరాయి దేశంమనిషి పై చూపునిలిపి, 'ఓ నాగరాజా ! నే పాడే ఈ నూత్న ఫణితులలో అపశ్రుతి ఏమాత్రం కలిగినా, ఈ నా కుడి చెయ్యిపై కాటేసి, నన్ను దహింపవలసింది' అని అడి గాడు. గుండెలుపగిలే పామునవ్వులో ఆ పరాయి దేశం మనిషి లేదన్నట్లు తలతిప్పాడు. ఒక్క నిమేషం నిర్మల నీలా కాశంవైపు చూపులు పోనిచ్చి కన్ను లరమూతలువడగా, స్ఫటికంలాంటి చెక్కు వీశాదండాని కానించి, ఒక్క విచిత్ర రాగం ఆలాపంచేశా డా బాలమూర్తి, కొండపొలాల్లో పరుగులెత్తే వాగులు పాటలు నిశ్చబ్దంలోంచి బయలుదేరినై.