Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగరాజు 34 అనగా అనగా ఆంధ్రదేశంలో పినాకి ఏతీరాన్న, సింహపురి పెరుమాళ్ళ దేవాలయమండపంలో ప్రతి సాయం. త్రం చిఱుమబ్బులన్నీ కరిగిపోయే దివ్యవీణాగానం వినిపిం చేది. దేశ దేశాల్నుంచి ఆ అమృతస్వరాలు వినేటందుకు వృద్ధులు, యువకులు నవతుపార పరిమళగాత్రులు, అంతా వచ్చి పులకరాలతో తన్మయత్వం పొందేవారలు. మండపం లోనూ `మెట్లమీదను రంగురంగుల వస్త్రాలతో నెన్నెట్లో మిగిబడే సముద్రపు కెరటాల్లా చిత్రమైపోయేవారు, కొన్ని నయనాలు నిమీలితములై పాడ్యమినాటి చంద్రవంకలా చెమ రించేవి. విస్ఫారితనయనాలు కొన్ని చైతన్యంవదలి బంగారు కిరణాల నీటిలో మఱచి విహరించే చేపలరీతిగా తళుకులాడేవి. ఆ మండపంమీద సౌందర్యంముద్దపోసిన ఓయావ నుడు దంతం, మంచిగంధంతీ గెలు సాగిన వీణ మేళవించి, గౌరీ శంకరశృంగంపై మంచుమరిగే విమల గాంధర్వం జగన్మో హనం చేసేవాడు. బంగారం ఒరిసే ఒళ్ళు, తెలుగుపల్లవుల వేంగీపురం – ఏనుగుల కుంభస్థలాల్లాంటిభుజాలు, పర్వత సానువువంటి వెడదరొమ్ము, నల్లటి ఉంగరాలజుట్టు, చిలక ముక్కు, విశాలమైన ఫాలం. ఆ పడుచుపాటగాడు, వీణ — వయ్యారంగా వల్లెవాటు వేసుకొని, చిక్కుడుకాయల్లాంటి వేళ్ళతో తీగెలు సవరించి, మెట్లునొక్కుతూ వీణపాడు