Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32 బాపి రా జు క థ లు నాగన్న కోపంతో వణికాడు. తలవాల్చుకొని తన గూడెంపోయి, నీలాలును తన హృదయానికి అదుముకొని, కంటనీ రెట్టాడు. @) 'ఏంటిబానా! అది' అంది వెర్రినీలాలు. భూదేవి గజ గజలాడింది కాబోలు! ఆ మర్నాడు పెద్దవాన ప్రారంభిం చింది. వానతో వచ్చి నాగన్నను అరెస్టు చేసి తీసుకుపోయి తాలూకా గ్రామంలో ఖైదుచేశారు పోలీసువారు. దొంగ తనం నేరం, మేజిస్ట్రేటు దగ్గిర కేసు. 5 ఉరుములూ మెరుములూ, వాన డల్పాటుతనం వదిలి తుంపరగా మారింది. పడమటినెక్కున తెలిపికనబడింది. పుట్టింటికీ పోకుండా ఉప్ప, నీలాలు భ ర్తకోసం అతని యింట్లో నే ఉంది. ఓ లాలింటికి నీలాలుకు ఆసరాగా ఉంది. పెద్ద ఉప్పరి పెళ్ళాం వచ్చి రిశీవకు నీలాలు భూమి కౌలుకిచ్చి చక్కా పోయా డు నీలాలు మన్నా సాయంకాలం నాన తెలిపి చూచి, పొలం ముదురాకు ఊడ్పి స్తే బాగుంటుందని అనుకొంది. “ఏకాడ నున్నావు నా బావా! ఏమి సేత్తున్నావు నా బావా?" అని అనుకుంది సీలాలు. “చలమయ్య అన్న నుపీడరు గోరిదగ్గరకు పంపినానుకదా! ఇంకా అన్న తన బావ ఊపొట్టుకోని రానేలేదు” అని తనలో మాట్లాడుకుంది. వెంటనే వెనకాలే వచ్చి ఎవరో కళ్ళుమూశారు.