Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాన నాగన్న వాళ్ళ ఉప్పర్లపల్లె 31 ఒక పెద్దగ్రామానికి సివారు. ఆ గ్రామంలో పెద్ద రైతునూ రెకరాల ఒక పంపును అంటే నాగన్న మూడెకరాల పంపూ ఉంది. పెద్ద రైతుకు అ చుట్టుప్రక్కల గ్రామాల్లో అయిదారువందల యకరాల భూములున్నవి. కలెక్టర్లే పెద్ద రైతు గాదికింద బంగాం తినే మూషికాలు. పొ నాగన్న పొలం కాలవగట్టు పొడుగునా ఉంది. ఆ పొలం పెద్దరైతు నూరెకరాల పంపుకూ, కాలవకూ అడ్డుగా ఉంది. తలుచుకుంటే నాగన్న మూడెకరాలలో ఆకుమళ్ళు మిలమిల లాడిపోతూ పోటెత్తుకువస్తాయి. కాలవ వదిలితే అయిదు నిమిషాలలో పొలం తడిసిపోతుంది. పెద్ద రైతు ఈ మూడెకరాలు అమ్మమని కోరాడు. నాగన్న రక్తపుబొట్టులు ధారపోసి కొన్న పొలం ఎల్లా అమ్ముతాడు! 'అమ్మ నేను 'బాబయ్యగారూ' అని మనవిచేశాడు. ఎంతమందిచేతనో చెప్పించాడు పెద్దరైతు. నాగన్న మే! నా ! ప్రాణాలా అందరదగ్గరా 'స్వామే! యన్నాడు. భూమిలో ఉన్నా' పెద్దరైతుకు పంతం వచ్చింది. బెదరించాడు. రెండ- రెట్లు ఖరీదిస్తానన్నాడు. బదలాయింపు నుంచిభూమి యిస్తా నన్నాడు. నాగన్న స్వమి 'బాబూ! భూమి నా పెద్ద బారియ, నా సిన్న దే నీలా'లని తలపంకించాడు. “సరే, లమ్డికొడకా! నీ భూమి దక్కదు, నీలాలూ- నీకు దక్కదురా” అన్నాడు.