Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28 3 అలాటి తనదొర, తన రాజు, తన బావను పెద్దరయితు దురన్నాయంగా ఖైదులో ఏయించాడు గదా? దేవుడునేడా! అమ్మవోరునేదా? ఆ ఆలోచనలకి అడ్డంవచ్చాకు, ఉప్పరి సెల మయ్య. ఆ రోజు పొలం ఆక్రమించుకోడానికి పెద్ద రైతువాన లోనే పదిమంది పాలేళ్ళతో వస్తున్నాడని సెలమయ్య కబురు చెప్పినాడు — వాననీరు కారిపోతుండగా తుడుచుకొంటూ ఒగర్చుకొంటూ. ఆ మాటలు వినడంతోటే నీలాలు ఆడ వేటకుక్కలా లేచింది. "ఓరన్న, గూడెంలంతా సెప్పరా!” అన్నది. మూల నున్న దుడ్డుకఱ్ఱపుచ్చుకొని బయలు దేరింది. వానజడితో వియ్యమందుతూన్న కంటినీరుమాయమై పోయింది. సివంగిలా ముందుకుసాగి నడిచింది. పొలంగట్టు మీదనుంచుంది. ఇంతట్లో ఒక వైపు నుంచి ఉప్పర్లు వచ్చారు. మరోవైపునుంచి పెద్ద రైతూ అతినిపా లేరూ వచ్చారు. నీలాలు కళ్ళల్లో ఎరుపులూ, పెద్ద రైతు గుండెల్లో చీటిపొగలూ కమ్మాయి. 66 ణ “నా పొలంలో ఏ యెదవ అడుగెడతాడో ఆణి సం కేసి అక్కడే పారేత్తాను.” అంది నీలాలు. పెద్ద రైతు మీసాలు రెండూ కోపంతో వణికిపోయాయి “ఆడలంజకి ఎంత పొగరూ? దీన్ని మొగుణ్ణి పొగరణచినట్లు దీన్ని అణచాలి. ఈయాళకి ఊరుకొంటున్నాను. రేప్పొద్దున్న