Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 300 బాపి రాజు క థ లు వల్ల సుమారు నూరురూపాయలు ఆదాయము తెచ్చుకునే వాడునూ అయిన నాగన్నను అల్లుడుగా ఎన్నుకున్నాడు హనుమన్న. పెళ్ళయి క్రొ తగా అత్తవారింటికి వచ్చిననాటి సంగ తులన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంది. నీలాలు — నాగన్న భార్యను చూచి ఉప్పొంగిపోయాడు. తన అందానికి తగిన అందాలపడుచు. పొద్దస్తమానాలూ ఉప్పొంగిపోతూ పాటలు పాడుకొనేవాడు —— “చిన్నదాన చిన్న దాన, వన్నేల వలపుదాన! కన్నుల నలువుదాన, పన్నులు తెలుపుదాన! చిన్నారి సిగ్గుదాన, యెన్నేల యెనుగులోన తిన్నంగా తేలిపోదాం ఓ సిన్ని దానా! ఓ సిన్ని దానా! అని నీలాలుని సందిట్లో బిగించుకొని, వెన్నెట్లో, ఇంటిదగ్గరనుంచి ఉప్పు లేరుకు తీసుకుపోయ్యేవాడు. "నీకు నాకూ జోడుఐతే మల్లెపూలు చెప్పగట్టి తెప్పమీదా తేలిపోదాం పదవే చల్ చిన్నారిపడుచా తెప్పమీదా తేలిపోదాం పదవే” సిగ్గుతో నీలాలు అప్పుడు ముసిముసినవ్వులు నవ్వు కున్నది. నాగన్న మెడచుట్టూ చేతులు గట్టిగా బిగించి, అతని వెడదయై · రొమ్ములో తనమోమును గట్టిగా అదుముకొన్నది. “ఏటే ఆలోసిస్తున్నావు? ఈపళంగా పడవఏసుకోని మన మిద్దరమే ఎల్లిపోతావుంటే నీ మొగఁసూత్తూ అంతా మరిసిపోయి, ఏళ్ళు ఏళ్ళు గడిపేసుకోగల్ను”