Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

25 ఆమెచూపులు అతనిపై ; అతని చూపులు ఆమెపై ; చూపు లలో చూపులు కలిసినవి. అతడు మదించిన యౌవన సింహము; ఆమె నూన్న తారుణ్యశోభావతియైన ఆడ సింహము! ఆమెనుచూచి అతడు అనుకున్నాడు. "పలకనైన పలకవే పంచదార చిలక వే” అతనిని చూచి ఆమె అనుకున్నది. "ఓరోరి! నా బావ, ఒయ్యారి నా బావ! మబ్బుల్నించి దిగివస్తావా! మాయదా? నా బావ! మబ్బుల్నించి దిగివస్తావా!” 2 ఒక పెద్దజట్టుకు నాయకుడై, అయిదెకరాల మాగా ణికి, ఆరెకరాల మెరకకు భూపతియై, సాలుకు రెండువందల యాభై రూపాయల ఆదాయం రాగా, మెరక ఊళ్ళలో ఏ నుయ్యో, పల్లపు ఊళ్ళలో ఏ చెరువో పల్లవుఊళ్ళలో ఏ త్రవ్వు కంట్రాక్టు పుచ్చుకొనిగాని, ఏ రోడ్లు జాగు చెయ్యడమో, ఏ క్రొత్త రోడ్లు వెయ్యడమో బోర్డు కంట్రాక్టరువద్ద త్రవ్వు పని ఒప్పు కొనిగాని సాలుకు మదరూపాయలు పైగా సంపాదించే, హనుమన్న తనకు ఏకైక పుత్రికయైన నీలాలుకు మంచిసంబం ధం తీసుకురావాలని ఊళ్లూ వాళ్లూ గాలించి వెదికాడు. వీరు దాటైనా ఇంటికి నచ్చిన పశువురు తెచ్చుకోమని తనజిల్లా దాటి, వేగుజిల్లాలకు వెళ్ళి, ఒక జట్టుకు నాయుడై, నాలుగు ఎకరాల మాగాణిభూమిమీద సాలుకు నూట మీూ భై రూపా యల ఆదాయం కలవాడున్నూ, అందగాడుశ్నూ, త్రవ్వుపని