Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 బాపి రాజు క థ లు నీలాల తన్ను చూచి అతను ఆగాడు. పాట ఆపాడు. గుండె కొట్టుకుంది. పై కుబికి రానివ్వకూడని రహస్యభావాలు ఆమెలో ఎక్కడో పెద్ద ఏరులా బయలు దేరినవి. బిగువుగా తొడుగుకున్న పీఠీరవిక క్రింద స్నిగ్ధాలె వట్రువలై బిగువైన ఆమె వక్షాలు రవిక ఖైదును పగులకొట్టి బయటికి వచ్చి నట్లయినవి. కమ్మని రంగురంగు నేలలున్న భూదేవికి వారు అనుగు బిడ్డలు. వారి పెద్దలు, ఆ కన్నతల్లిలోని ప్రేమను చూర గొన్న ఉప్పగులు, నర్ల నల్ల రేగనులు, ఎకచెక్కులు నీ లెగువు ఒండ్రు బంగారాలు, తెల్లని గండ్రయిసుకలు, బంగారు సన్న ఇసుకలు నిండిపోయిన ధూళిరంగు చౌటిపర్రలు వారి గునపాలచే పొరలచే మధి పబడ్డవి. భూదేవిలోని రహస్యాలు, ఆమెకర్కశత్వం, ఆమె లోని కరుణ వారికి తెలియునట్లు ఇంకోరికి ఎట్లు అవగతమవు తుంది. ఆమెలోని రసజ్ఞత్వము వారు నూతులుకట్టి పైకి తెత్తురు. ఆమెలోనిమహదైశ్వర్యము గనులు దింపి లోకానికి అర్పింతురు. ఆమె దివ్య! ఆమె దివ్య ప్రేమను కాలువలు త్రవ్యి దేశ దేశాలు ప్రవహింపజేతురు. గుళ్ళుగా, గోపురాలుగా భూలక్ష్మీకి నూతనాలంకారాలు వారు సమర్పింతుకు. భూసంతానమైన వారిఒడలు సకల సుగంధాలను మలయానిలునకు అర్పిస్తూ ఉండుకు. అందానికి మూలమైన విశ్వంభరానిధినుంచే వాళ్లు సకల సౌదర్యాలను సేకరిం తురు. ఆ ఉప్పర్లకులంలో వాళ్ళిరువురూ ఉత్తుంగశిఖరాలు.