Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23 కలిపేసినట్లయి, విదరిల్లె అమెఒళ్ళు నీరసిస్తోంది. బిగువై, సు దరమై, పూర్ణమైన నవయౌవనంలో తీరని ఆవేదన సర్వ మునూ శుష్కింప చేస్తున్నది. తీయని తన మధుర కంఠం జీరవోవ ఆమె పాట సాగించింది. అద్దరూపాయి పెట్టి అద్దాల రవిక కొంటే, రవికన్నా చిరగలేదే దూడమ్మా, దూడ దూడా కోటప్పతిరణాలెల్లి కోరీన సవరం తెస్తె కొప్పన్న మాయలేదే దూడమ్మా, దూడ దూడా! మూడురూ పాయ లెట్టి ముత్యాలపాపట బొట్టు బొట్టన్నా చెరగలే చేదూడమ్మా దూడా! ట బంగారు ఆమెజీవితమంతా నిండిపోయినాడు ఉప్పరి నాగన్న. నాగన్న పొడుగాటి కోరతలపాగా అందగాడు. గిరజాలు, పెద్ద ముడిజుట్టు. కారు నల్లరాతిబండల బలం తిరిగిన వయసు కాడు. వెండిబిళ్ళల తాడు. బంగారు మురుగులు, దండకడియం, ఎడమ చెయ్యి పైభాగంలో మాయపచ్చ. బిందువు వేలాడు బంగారుపోగు, ఎర్రరాళ్ళ తమ్మంట్లు, శుభ్రమైన ముదుకపంచి ఎగదోసి కట్టుకొన్న పనితనం. ఈలా, తనకు మొదటిసారి ప్రత్యక్షమైన నాగన్న అద్భుతరూపం శీలాల కళ్ళల్లో మెఱపు మెరిసింది. ఆనాడు అతగాడు పాటపాడుతూ తన తండ్రిగారి పొలంలో తనకు తార సిల్లాడు. “బెజవాడ చిన్న దానా, బాజూ బందూల దానా. బాజూబ దూలవిూద, మనసేల లేదే ఓ చిన్న దానా,