Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాన 3.2 “ఎల్లీ జగ్గాయి పేట యెన్నంగ నేను పో తే యెగ రేసి .వలపులు జల్లే దూడమ్మా, దూడ, దూడా సిగదీసి కొప్పుబెట్టీ, సిందూరం బొట్టు పెట్టీ నా అందం నవ్విపోనూ దూడమ్మా, దూడ దూ. రంగూ రంగూలదూడ, పొంగుచూ ఎగిరే దూడ కాళ్ళగజ్జెలదూడ, గంతూ చందూలదూడ. దూడమ్మా, దూడ చూడా, దూఢమ్మా, దూడ దూడా!!" ఈ పాట వానచినుకులశృతిలో కలిసిపోతోంది. చిన్న ఇల్లూ, చుట్టూ చిన్న ఆవరణ, ఆవరణచుట్టూ తాటాకుల డడి. ఆ దొడ్లో ఉన్న వన్నీ పాదులు, పాదులమధ్యను బంతి చెట్లు, చెట్లపై బంగారు ముద్దపూలు. గుడిసె గుమ్మంలో నీలాలు కూర్చునిఉంది. జుట్టు దువ్వుకోదు. బుక్కా రంగయ్య దగ్గర కొన్న కుంకుమబొట్టుమాత్రం సూర్యబింబంలా ఆమె నీలఫాలాన ఉదయారుణకిరణాలు వెదజల్లుతూ ఉంటుంది. నెడదలైన ఆమె కన్నుల్లొ నవ్వులేదు. కంటికి పెట్టిన కాలుక, కన్నీటితో నున్ననైన ఆమె చెక్కు_లమీద మరిన్నీ నలుపురంగులు రచించింది. ఆమె కూర్చున్నమూ ర్తిలోనే అతిదీనత్వం అలుము ఆమె గుండెలో బాధ కడుపులో చెయ్యేసి కొనిపోయి-ది