న ర ప తి 15 కుక్క కళ్ళపై తగిలి కళ్ళు మూతపడిపోయినవి. కెవ్వుమని సారమేయపతి నేలపై మూతిమోపి, హృదయంకరిగే అరపు అరచినాడు. ఉరుమువంటి దానిగొంతుక కరిగిపోయింది. ఆ శునకరాజము భయపడిపోయింది. ఏమియుతో చక తాత్కాలికంగా గ్రుడ్డి అయిపోయినకళ్ళతో నిల్చింది. దానిడొక్కలు, దేహము వణికిపోయాయి. ఆ బాలిక ఆ బెత్తము పార వేసి, అత్యంత మాధురీస్వనాల్తో ఆ కుక్క దగ్గి రకుపోయి, దానితల తన వొడిలో ఉంచుకొని, దాని చెవిలో మాటలు చెప్పసాగింది. దాని ఒడలు తుడిచింది. దానికళ్ళు ఒత్తింది. నీళ్ళు కారుతూవున్న కళ్ళువిప్పిందాకుక్క బాలిక మొగం చూచి బొంగురుధ్యనితో ఆమెమోము నాఘ్రాణం చేసింది. తన్ను ఓడించిన ఆ బాలిక్కీ, ఆ కుక్కకూ ప్రాణ స్నేహం కుదిరిపోయింది. ఆ బాలిక చురుకువాటులతో ఆ శునక రాజముయొక్క కరకుతనం మటుమాయమైపోయింది. నీళ్ళు సుడితిరుగు కమలనయనాలతో ఆ బాలిక. ఆ కుక్కను ముద్దు పెట్టుకొని కౌగిలించుకోంది. ఆమె జవ్వున నిలబడి ఆ నరపతిదిక్కు చూచి “నర పతీ! నువ్వు మహాబలవంతుడవట; మహా ఖడ్గ కృపాణ యుద్ధాల్లో ప్రఖ్యాతి నందినా వట; నీకు నువ్వే సాటట. నువ్వు ఓడించినావని గర్వపడుతూవున్న మాతండ్రిగారే నాకు గురువు. నేనూ సమసాయుధాలు అవలీలగా ఉపయోగించే కౌశలముకలదాన్ని. నీవు వీరుడ నైతే నాలో కరవాలయుద్ధానికి రమ్ము. నువ్వు మహాబలవంతమనుకొనే ఈ సార మేయము నాకు ఓడిపోయినది. దీనికిన్నీ దీని స్నేహితుడగు నీ రాక్ష
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/17
స్వరూపం