12 బాపిరాజు క థ లు ఎట్టిభయంకర శునకాన్నైనా తీసికొనిరానిమ్ము. న న్నది ఏమిచేస్తుంతో నీ కన్నులు పారకిస్త విగాక!” " తోకతొక్కిన భుజంగంలా లేచాడా నరపతి, సాయం కాలానికి సభ్యు, తన ధనకనక మహాపట్టణంలోని ప్రజలు, సామంతులు, సైన్యాధిపతులు, అందరూ మల్లరంగానికి రావాలని ఆజ్ఞాపించాడు. జన ఏమిది రాజాజ్ఞ? అని అందరూ చేరారు. అత్యంత విశాలమైన మల్లరంగం కిటకిటలాడిపోయింది సమూహాలతో, మల్లరంగంలో యిసుక రేణువులు అపరాహ్లసూర్యకిరణాల్లో తళుకు తళుకుమనిపోయాయి నరపతి తేరిపారచూడజాలని వైభవంతో వచ్చాడు. ఆయుధపాణులైన స్త్రీభటులు పారాయిచ్చే అందలంలో వచ్చింది ఆ బాలిక. ఆ అబలాగత్నాన్ని రణరంగంలోకి తీసికొనివచ్చారు. సరపతి సింహాసనం ఆ కమించాడు. ఆ బాలిక చేతిలో ఒక బెత్తముమాత్రమున్నది. నరపతి న్నుల్లో అపహాస్యపు వెలుగులు తిరుగుతూ
ఉన్నవి. నరపతి చేతితో సంజ్ఞ చేయగానే ఒకవైపునుంచి రాక్షసుడొకడు ఒక అడవిజాతి మనుష్యుడు) భయంకర రూపంవాడు, జేవురించిన ఎఱ్ఱలిరంగు వాడు, మిట్టకోరల చి పిజుట్టువాడు, వాడు, మదించిన దేహ౦గలవాడు, ఎనిమిది అడుగుల పొడవుగలవాడు. రాతిదిమ్మెల వెడద ఎడంద వాడు, మిడిగుడ్ల వాడు గట్టి బంగారపు గొలుసుతో ఒక శునకాన్ని పట్టుకొని రణరంగంలోకి దుమి కాడు.