న ర ప తి 9 వాళ్ళంటే ఉండే నిరసన చేత. వాళ్ళకష్టసుఖాలు విచారించడం గాని, వాండ్లకు సౌకర్యాలు కలుగ జేయడంగాని వాళ్ళ కుసరి యైన న్యాయంకలిగేట్టు చూడడంగాని, సుతరామూ ఏమిన్నీ లేదు. తన కింద ఉండే సామంతరాజులు ఎవరైనా తన మండలంలో ప్రజానుకంజకులై వారిని సకల ధర్మయుక్తంగా పరిపాలన చేస్తూ ఉంటే, ఆరాజులను ఈ నరపతి హేళన చెయ్యడం వాళ్ళను తన మహాసభలో అగౌరవపరచడం. నకుల్ని వాహనంగా జేసి నైరుతినిమించిన రాక్షసుడై నర బాధకుడైన మహా అందగాడై అనరపతి మహాభయంకర భుజంగంలా, చండ మృగాదనంలా, క్రూరసౌందర్యంతో విరాజిలుతూ ఉండేవాడు. 4 ఆనాడు అలా మందిరంలో శయనించి ఉండి, మూలగా వీణవాయిస్తూ ఉన్న ఒక దివ్యమోహనవిగ్రహయైన చిన్న దాన్ని తనదగ్గరకు రమ్మని సైగ జేశాడు ఆ సరపతి. ఆమెను వర్ణించాలంటే మనోహర సుగంధకుసుమాలన్నీ మరిగి కలిగి పోతవి. మంజుల సౌదామినీలతలు మసక మసక లై పోతవి. ఇరువది వర్షాలు ప్రాయం వాడైన ఆ సరపతి వివాహము చేసుకొనలేదు. వివాహం అతని కేమీ ఇష్టంలేదు. స్త్రీ అంటే అసహ్యము. జీవ ప్రపంచంలో ప్రపంచంలో హేయమైంది వనిత. వాళ్ళు సేపకేకాని, ఉద్వాహంచేసుకోవడానికా? ఆ నరపతి ఘోటక బ్రహ్మచారి. వణుకుతూవచ్చింది. ఆ కన్యక నరపతియెదుటకు. “భరత
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/11
స్వరూపం