Jump to content

పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98. బాపిరా $ 000 వాడు ఒకడూ కనిపించలేదు, పొద్దున్నించీ లక్షలకొద్దీ టపా కాయ లమ్మిన సాహెబు "సాలా బాగా పేలుతాయండీ! జర్మనీవాడిఫిరంగి లాగా వుండాలి. మీక్ అయిదువందల్ ఏసుకోండి" అని విచిత్రంగా అమ్మగలిగాడు కాని, కొనేవాళ్ళకి చూపించ డానికి కాలిస్తే పేలకుండా, తుస్సుకున్న టపాకాయికూడా ఆ కుర్రవాణ్ణి ఏరుకోనిచ్చాడు కాదు. పొద్దున్నుంచీ ఇంటి కెళ్ళి తిండయినా తినలేదు ఆవుప్పరి వాడు. వాళ్ళమ్మా, నాన్నా, "ఎర్రోడు ఎక్కడికిపోయాడో గంజి నీల్లకయినా వచ్చాడు కాదు" అని అనుకున్నా గాని, ఆ కుర్రవాడికోసం వెదుక్కుంటూ వచ్చినవాళ్లు లేనేలేరు, ఆ సాయంత్రంనుంచి బందరువీధులన్నీ తిరిగి, ఆ కుం కాయి బచ్చుపేటలో బాగా బాణాసంచాలు కాల్చే ఒక మేడముందర నిలబడ్డాడు. ఆ ఇంటిలోని పెద్దలు ఆడపిల్లల చేత, మొగపిల్లల చేత కల్పించిన బాణసంచాలు స్వ దేశీవీ నలభై రూపాయలదాకా ఉంటాయి. వీ వి దేశీవీ పిల్లల ల కిలకిలలు, పెద్దల నవ్వులు, గుమ్మందగ్గర కళ్లు లేని ముసలమ్మ బోసిహాసం. ఆ యింటిముందర బాణసంచా కాల్పులు చూడడానికి చేరిన తక్కిన బీదవాళ్ళ పిల్లలు వెకి లిగా “ఇవి యివ్వండీ! అవి ఇవ్వండి!" అని అడిగి పుచ్చు కొని కాల్చుకొంటున్నారు. భయంచేత పారేసిన సగం కాలుతూ ఉన్న మతాబులు పుచ్చుకొని కాల్చారు. వీడు మాత్రం చూస్తూనే నిలుచున్నాడు. కాని ఒక్క అడుగయినా కదిలాడుకాదు,