3 8 ఆ నరపతికి ప్రపంచమన్న కోపము. నరులన్న హేయము. ప్రజలందరు కాకుల గుంపులు. వాళ్ళచిత్త వృత్తులు అతిచంచలమైన పొగమంచులు. ఉత్త మపురుషులకు సామాన్యమానవులు బానిసలు. వాళ్ళకి దాస్యం చేయటాని కే ఆ పసదాలు పుట్టింది. ఈ ప్రపంచంలో మహాసత్వులకు తప్ప యింకెవ్వరికీ తలయెత్తి తిరగడానికి స్వతంత్రం లేదు. వాళ్ళు సామంతరాజులై తేయేం? మండలాధిపతులై తేయే! అందరూ ఒక్కడికే శుశ్రూష చేయాలిసిం దే. జయ యాత్రలు ఆ నరపతితో సమానమైన గొప్పదనంకలవాళ్ళు లేనే శ్రీరు. ఏరాజైనా తన క్రింది వాడే. భరత దేశం అంతా దిగ్వి తనక్రింది చేశాడు ఇది హేనుసార్లు. కామరూప, వంగ, మగధ, మాళన, మత్స్య, పాంచాల, కాశ్మీర, గాంధార, సింధు, బర్బర, కా భోజ, అవంతి, ఘూర్జర్, పుళింద, కళింగ, పాండ్య, చేర, చోళ, కేరళాది సకల రాజ్యాలు అతనికి లోబడ్డాయి. ముప్పదియారు ద్వీపాలు - సువర్ణ, యన, కుశ, అపర్ణ, జవన, సుమిత్ర, సింహళ, క్రౌంచాది ప్రాచ్యద్వీపములు, యవనచంద్ర, అపరాంత, సాహ్లవ, రోమకాది ప్రతీచీద్వీపములు, వాటి ప్రభువులు అతని నౌకాబలాలకు జోహార్లు చేశారు. అంత మహాబలవంతుడై రాజ్యం చేస్తూ రాజ్యంచేస్తూ ఆ నరపతి ప్రజాకంటకుడయ్యాడు. ప్రజలదగ్గిర పన్నును . ఎక్కువ వసూలు చేయడ మే కాదు, వాళ్ళని దోచుకోవడమే కాదు;
పుట:Raaga Maalika Adivi Bapiraju.pdf/10
స్వరూపం