పుట:Raadhika Santhvanamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 రాధికాసాంత్వనము



మెచ్చులైన చక్కని చెక్కు గీటినన్ గీటనీయక మధురసుధారసధారాధురంధరంభైన బింబాధరంబు గ్రోలినం గ్రోలనీయక కుందనంపుటందంబు గెంటినపువ్వును గంటు పఱుచు తుంటవింటిపాదుశాహుదివాణంబు నంటిన నంటనీయక మెం డొడ్డుకొన నాదరించి యొయ్యన శయ్యంకుఁ జేర్చి లాగించి కౌఁగిలించి బాహాబాహిఁ గచాకచిఁ బెనంగి యల్లందులకుం గమకించి చివురు సౌరు జవురు తావి మోవితేనెలం గ్రోలి పైకొని కోకిలచందంబున గుబగుబం బలుకుచు మేలు భళా పంసందు సేబాసు నాసామి యదిరా యదిరా యని మెచ్చి యొక్కరొక్కరే మేను లప్పళించి వింతవింతపిలుపులం బిలుచుచుఁ గెందామరలం బోలు కందామరల నరమోడ్పులు గావింపుచు మన్మథబ్రహ్మానందంబునం దోలలాడుచునుండి రని చెప్పిన శుకుం డిట్లనియె. 117[1]

శా. కస్తూరీతిలకోజ్జ్వలస్మితముఖా! కైవల్యలక్ష్మీసఖా!
హస్తోదంచితశంఖచక్రరుచిరా! హస్తీంద్రరక్షాపరా!
అస్తోకామృతవర్షవేణునిసదా! యానందలీలాస్పదా!
త్రస్తానేకజనాభయప్రదకరా! ధారాధరశ్రీధరా! 118

  1. గమనిక : 117 వ సంఖ్య గల గద్యయు, గ్రంథాంతగద్యయు నక్కడక్కడ అహల్యాసంక్రందనమును బట్టి సవరింపఁబడినవి.