పుట:Raadhika Santhvanamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 రాధికాసాంత్వనము

గాఁగ వగచుచు గద్గదకంఠ యగుచుఁ
బ్రేమ మీఱంగ దీవెనవీడె మిచ్చి
పనుపఁజాలక పైనంబు పనిచినట్టి
యువిద నెడబాసి యిందుండు టుచిత మగునె. 95
… … … … … … … …
… … … … … … … …
… … … … … … … …
… … … … … … … …
(ఇటఁ గొంత గ్రంథపాతము దోఁచెడిని)

సీ. (మగతేఁటి గఱులకు మగువ ముంగురులకు
నేనాటి నేస్తమో యెఱుఁగ రాదు)
♦అల మించు సోగకు నతివ మైతీఁగకు♦[1]
నేమి చుట్టఱికమొ యెఱుఁగ రాదు
పూర్ణసోమునకును బొలఁతి మోమునకును
నెచ్చటి మచ్చికో యెఱుఁగ రాదు
కపురంపుఁ దావికిఁ గలికి కెమ్మోవికి
నే యనుబంధమో యెఱుఁగ రాదు
గీ. చెలియ జిగిచూపు నును నల్లగల్వ తూపు
కొమ్మ పాలిండ్లు బంగారు నిమ్మపండ్లు
చెలువ నూగారు సల్లని చీమబారు
లొక్కచోటను బుట్టని దొక్కకొదవ. 96

  1. ఈ గుర్తుల మధ్య నున్న పాదార్ధ మొక సర్దుబాటు