పుట:Raadhika Santhvanamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



గీ. ఎల్లవారికి శకునంబు లెఱుఁగఁబలికి
బల్లి తాఁ బోయి తొట్టెలోఁ బడిన రీతి
నొకరి నని నేనె మోసపో[1]తిఁక న దేల
వెనుక చింతించు టెల్లను వెఱ్తఱినము. 72

గీ. నీవు పోయిన పనికి రానీవు కొదవ;
పట్టి పల్లార్చి దేవకిపట్టి నిటకుఁ
దోడుకొనివత్తు వనుచు నీ తోడు చిలుక
నమ్మిఁకను నెమ్మనంబున నమ్మియుంటి. 73

వ. అన విని శుకం బి ట్లనియె. 74

క. తల కెక్కిన వలపున హరి
యలుకుచు దాసానుదాసుఁ డై మెలఁగంగాఁ
గలవే యిఁక నడియాసలు
కలిఁ బోసిన వెనుక నుట్టి కనుగొను రీతిన్. 76

వ. అనిన విని దురంతచింతాభరంబున విరహవేదనాదోదూయమానమానసురాలై దిగ్గున బెగ్గడిల్లి. 76

సీ. జడ వేగ వదలించి ముడి పూలు విదలించి
యలజడిఁ గీల్గంటు నందగించి
జిగివల్వ సడలించి బిగిరైక నెడలించి
సగము మాసిన చీర సంఘటించి

  1. మోసపోతి (న్) + ఇక — ఇట నుత్తమపురుషైకవచనక్రియ - 'ఇ' కార సంధివిలక్షణతయు, నిర్బిందుక సబిందుక ప్రాసయతియు గమనింపఁదగినవి.