పుట:Raadhika Santhvanamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అనిన విని చిలుక యిట్లనియె. 25

క. తెఱవా యే మని చెప్పుదు
హరి యున్న గృహంబుఁ జేరి యటు చూతుఁ గదా
సురతోద్యుక్తుల సత్యా
మురహరులం జూచి ఖేదమోదములయ్యెన్. 26

వ. అది యెట్లంటి వనిన. 27

సీ. పన్నీటి మేరువుల్ బాగాలతట్టలు
కలపంపుగిన్నెలు గందవొళ్లు
ముడిపూల పొట్లముల్ పునుఁగుఁగరాటముల్
జవ్వాజిగిండ్లు ద్రాక్షారసంబు
అద్దముల్ సొమ్ములు నత్తరుచెంబులు
కుంకుమపింగాండ్లు గుసుమతతులు
కపురంపుఁ గ్రోవులు గస్తూరివీణియల్
గట్టు వర్గంబులుఁ జుట్టుదనరఁ
గీ. జలువచప్పరకోళ్లమంచమ్ములోనఁ
జెంపబిల్లలుఁ దలగడల్ చెలఁగుదిండ్లు
బటువు లొరుగులు గల పూలపాన్పుమీఁదఁ
దమకమున సత్య హరియును దగఁబెనంగి. 28

సీ, కొసరుపల్కులఁ బమ్మి గోటికత్తులఁ జిమ్మి
కాసెలోఁ జెయి వేసి కదియఁదీసి
కర్ణాతు[1] లాగించి కౌఁగిట బిగియించి
సరిబిత్తరుల నొత్తి సాగనెత్తి

  1. కర్ణాతు=కన్నాత. మల్లయుద్ధములో నొక విన్నాణము—శుద్ధాంద్ర పద పారిజాతము. లక్ష్మీ నారాయణ నిఘంటువు