పుట:Raadhika Santhvanamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xvi గ్రంథ ప్రచురణ

చెన్నపుర ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నం R. 28 రు గల తాళపత్త్రప్రతి యొకటి కలదు. అదియు సముఖము రాధికాసాంత్వనమే. కానీ యందలి వ్రాఁత యొక తీరు, తప్పులున్నవి, శైథిల్యము గలదు, గ్రంథపాతములు నెడ నెడఁ గలవు. అచ్చటనే నం 199 రు కాగితపుఁ బ్రతియు నొక్కటి కలదు; కాని దాని మాతృక పై శిథిలతాళపత్త్రప్రతియే. ఆంధ్రసాహిత్యపరిషత్తు ప్రతియే మేల్తరమైనది.

నా కీ గ్రంథ పరిష్కరణోద్యమమునఁ దోడ్పడిన యాంధ్రసాహిత్యపరిషత్కార్యదర్శి శ్రీ చతుర్వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికిని, మేనేజరు శ్రీ వద్దిపర్తి చలపతిరావు గారికిని, దక్కిన పారిషదులకును గృతజ్ఞుడను.

అభినవముగ నాంధ్ర రాష్ట్రప్రభుత్వశుభోదయమైనది. ఇఁక నైన నిట్టి యమూల్యగ్రంథజాలము నాంధ్ర ప్రజ కందిచ్చు పరిషత్తువారి పూనిక నగ్గించి, ధనాభావముచే వెనుకపడియున్న పరిషత్తుసకు శుభాక్షతలుగా విరాళముల నిచ్చి ప్రోత్సహించి, తద్గ్రంథభాండాగారమునఁ దాళపత్త్రతనుకార్శ్యముతో నసూర్యంపశ్యలై పడియున్న కావ్యసుందరులను జూచుట కాంధ్రసాహిత్యసత్యవతులు నోచుకొందురుగాక.