Jump to content

పుట:Raadhika Santhvanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



గ్రంథ ప్రచురణ.

ఈ ప్రచురణకు మూలము : ఆంధ్రసాహిత్యపరిషత్తులోని సం. 177 రు గల తాళపత్త్రప్రతి. లేఖకుఁడు తంజావూరికవి వేంకటస్వామి నాయకుఁడు. అతఁడు వ్రాసినది కీలక మార్గశీర్షమున. ప్రతిస్థితియు, లేఖనవైఖరియు బాగుగనే యున్నవి. కాని వ్రాఁతతప్పులు లేకపోలేదు. అవి యీ దిగువ నుదాహరింపఁబడిన ముద్దుపళని ముద్రితప్రతులను సంప్రతించి సవరించితిని.
1. తిరుక్కడియూరు కృష్ణారావు గారిచే-
శ్రీధామ ముద్రాక్షరశాల ప్రచురణ- (1887 క్రీ. శ.)
2. ఎద్దనపూడి చెంచురామయ్య గారిచే -
శ్రీ పారిజాత ముద్రాక్షరశాల మదరాసు (1908)
3. కె.జి. మూర్తి, శృంగార గ్రంథమండలి, మచిలీపట్టణము - (1936]
4. శ్రీ సత్యనారాయణ పబ్లిషింగ్ హౌస్, రాజమండ్రి - [?]
5. వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. మదరాసు - (1950)
పై వానిలో 1,2 ప్రతు లొక్కమాదిరిగను, 3,4 ప్రతు లొక్కమాదిరిగను నున్నవి. ముద్రితప్రతులలో నపపాఠము లున్నచోట్ల మూలప్రతిపాఠములే స్వీకరింపఁబడినవి. ముద్రితప్రతుల కతీతమైన చోట్ల నున్న లేఖకప్రమాదము లర్థానుగుణముగా సరిచేయఁబడినవి. పాఠాంతరములు పుటల కడుగునఁ జుక్కగుర్తులతోడను జూపఁబడినవి, గ్రంధపాతములు ముద్రితపతుల సాహాయ్యమునఁ గుండలీకరణములలోఁ బూరింపఁబడినవి.