పుట:Raadhika Santhvanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసినది పళని. సముఖము వృత్తిచే దండనాథుఁడగుటచే గాఁబోలు కర్ణాతు, కల్లము, సరిబిత్తరము లను మల్లబంధవిశేషములనే సందర్భసుందరముగా ననుసంధించినాఁడిచ్చట. పళని పద్యములో ‘నల్లందులకు జొచ్చి’ యనుప్రయోగము ససారస్యమే గాని యదియు నాయకు నుచ్ఛిష్టమే. (చూ.స.రా.పా.117).

‘కాంత లిట్టుల రా నీక ఱంతు సేయ
నీటిచిమ్ముల కళుకక నిలుచు గంధ
సింధురం బన నిలఁబడి శ్రీధరుండు
పలికె వారలఁగని నయభయము లమర’-(106 స-రా పా)

‘చెలిచెలు లిట్లుచేరి....రవ్వలిడఁగాఁగని శ్రీహరి యీటెపోటుల
గలఁగని గంధసింధరు మనంగఁ దొలంగక నిల్చి యి ట్లనున్.’-(ము ప-రా. సా IV 16)


ఇందు ఛందస్సు మాఱినది గాని గంధసింధుర మట్లనే యున్నది.

సుదతి యిసుమంత కడకంటఁ జూచినంత
నింత ఱంతులు సేతురా యింతులార
మీరు నా మాఱు పదముల మీఁద వ్రాలి
కలయఁ గలయించి సుకృతంబు గట్టుకొనరె. స-రా, సాం. 107

సుదతి యిసుమంత కడకంటఁ జూచినంత
నింత ఱంతులు చేతురా యింతులార
అలుక దీఱంగ దొరసాని కమరఁ బలికి
చెలిమి యొనరించి సుకృతంబుఁ జెందుఁ డనిన. (ము ప-రా. సా IV 17)

ఇందు పూర్వార్ధము లొకటే మోస్తరు. ఉత్తరార్ధమున నున్న సముఖము స్వారస్యము పళనిపద్యమునకు రాలేదు.

ఇందుబింబాస్య నవ్వుల కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె,
నింతినునుగప్పుకొప్పున కెంచి చూడఁ