పుట:Punitha Matha.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీసభ యందు సామాజికంగా ఫలసిద్ధి నిస్తుంది. మరియయందు క్రీస్తురూపం సంపూర్ణంగా ప్రతిఫలించింది. అనగా ఆ విశుద్ధురాలు దేవుడు సంకల్పించు కున్న నరులు ఎలా నిర్మలంగా వుండాలో అలా వుండిపోయిది. కనుక దేవుడు సంకల్పించుకున్న క్రైస్తవ సమాజానికి - ఆ సంకల్పం ప్రకారం జీవించలేకపోతూన్న క్రైస్తవ శ్రీసభకు - ఆమె ఆదర్శంగా నిలుస్తుంది.

దేవుడు నరుల్లో ఎలా కన్పిస్తాడో, క్రీస్తు మానవుల్లో ఎలా ప్రతిఫలిస్తాడో చూడాలంటేమురియను చూడాలి. మంగళప్రదమైన ఆమె మహిమాన్విత గుణాలన్నీ మన మీద పనిచేస్తాయి. మనమూ ఆమె మహిమను పొందేలా చేస్తాయి. ఆమె శ్రీసభలో తొలివ్యక్తి మనం మలివ్యక్తులం. అందుకే మనం ఆ యావలి తీరాన్ని చేరుకోవాలంటే ఆమె సహాయం పొందుతూండాలి.


దేవుడు మానవుల మధ్యలో జన్మించడానికీ, అలా జన్మించి మానవులను దేవుని బిడ్డలను చేయడానికి మరియనుండి జన్మింపవలసి వచ్చింది -గల 4,5. కనుక ఆ తల్లి దేవమాత, మానవులమాత. ఆ పునీత మాతకు జోహారు!