పుట:Punitha Matha.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంటె కూడ మరియ అధికంగా విన్నపం జేస్తూ వీళ్లందరికీ తాను విజ్ఞాపన విషయంలో మాతృకగా వుంటుంది.

ఉత్థాన క్రీస్తు రాజుగా పరిపాలనం జేస్తూంటాడు. శ్రీసభకూడ ఈ క్రీస్తు రాచరికంలో పాల్గొనాలి -2తిమో 2,12 మరియ రాజ్జీత్వం శ్రీసభ రాజ్ఞత్వానికి మాతృక.

సంగ్రహంగా చెప్పాలంటే మరియు శ్రీసభకు, అనగా మనకు ఆశగాను అదరువుగాను వుంటుంది. ఆమె మహిమను పొంది మోక్షంలో వుంది. మనమూ ఆ పదవిని పొందాలి. కాని ఇంకా పొందలేదు. అంచేత ఈ లోకంలో వున్నంత కాలం ఆమెవైపు చూస్తూంటాం. ఆమె వున్నచోటికి వెళ్లాలని ఉవ్విళూరుతుంటాం. ఆమె మనకు అండదండగా ఆదరువుగా వుంటుంది.

క్రీస్తు మనకోసం ఏమి సాధించాడో, క్రీస్తునుండి మనం ఏమి సాధించ గోరుతుంటామో అదంతా మరియు ఈ వరకే సాధించింది. కనుక ఆమె శ్రీసభకూ, క్రైస్తవ ప్రజలకూ మాతృక మాతృప్రతిని చూచి మరో ప్రతిని వ్రాస్తారు. మాతృచిత్రాన్ని చూచి మరో చిత్రాన్ని గీస్తాం. అలాగే మాతృకయైన మరియను చూచి మనమూ ఆమెలాగే తయారు కాగోరుతాం. ఆమె శ్రీసభకు మాతృక, ఆదర్శం, ప్రాతిపదిక అంటే భావం యిదే.

మరియను ఎప్పుడూ శ్రీసభతో జోడిస్తుండాలి. ఆమెను అర్ధం చేసికొంటే శ్రీసభను అర్థం చేసుకున్నట్లు. శ్రీసభను అర్ధం జేసికొంటే ఆమెను అర్ధం జేసుకొన్నట్లు. ఇక మరియు శ్రీసభలను అర్ధం జేసికొంటే క్రీస్తును అర్ధం జేసుకొన్నట్లు క్రీస్తు రక్షణం మరియయందు వ్యక్తిగతంగా,