పుట:Punitha Matha.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్ధం జేసికొంటుంది. తాను వాళ్లపట్ల సానుభూతి జూపుతుంది. తన పుత్రికల బాధోపశమనానికి అవసరమైన వరప్రసాదాన్ని ఆర్జించి పెడుతుంది. కనుక క్రైస్తవ గృహిణి కష్టాల్లో ఆ తల్లివైపు దృష్టి మరల్చి ఆమె సహాయం అడుగుకోవాలి.

12. మరియు మాత - సమైక్యత

మరియమాత ఈ ప్రంపచాన్నంతటినీ క్రీస్తుతో ఐక్యపరుస్తూం టుంది. విశ్వజనాన్ని విశ్వ మతాలనూ, క్రీస్తుతో జోడిస్తుంటుంది. ఈ యధ్యాయంలో క్యాథలిక్ ప్రొటస్టెంటు శాఖలకూ, హిందూ ముస్లిం శాఖలకు చెందినవాళ్లను ఆ విశ్వజనని ఏలా ఐక్యపరుస్తుందో విచారించి చూద్దాం.

1. ప్రొటస్టెంటు శాఖలు

నేడు ప్రొటస్టెంటు శాఖలు చాలవున్నాయి. కాని మొదటి శాఖలు లూథరెన్, కాల్వినిష్టు శాఖలు రెండే. మరియమాత క్రైస్తవశాఖలన్నిటినీ అవి క్యాథలిక్ సమాజానికి చెందినాసరే- క్రీస్తుతో ఐక్యపరుస్తుండాలి. కాని అనేక కారణాలవల్లా అపార్ధాలవల్లా ఆ తల్లి క్యాథలిక్ క్రైస్తవులకూ ప్రొటస్టెంటు క్రైస్తవులకూ విభజన కారణమైంది గాని ఐక్యతాకారణం కాలేదు. ఈ సమస్యను కొంచెం చారిత్రక దృష్టితో తర్కించడం అవసరం.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతను గూర్చి విశ్వసించే అంశాలను ముందటి అధ్యాయాల్లో విచారించాం. ఇక 16వ శతాబ్దంలో ప్రొటస్టెంటు తిరుగుబాటు వచ్చింది. లూథరు కాల్విను మొదలైన నాయకులు చీలిపోయారు. ఆదిమ క్రైస్తవ సమాజం క్యాథలిక్ సమాజంలో కొనసాగుతూ వచ్చింది. చీలిపోయిన నాయకులు మాత్రం