పుట:Punitha Matha.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమోచించుకోవాలి. మరియ కన్యత్వం మాత్రమే గాక ఆమె సామాజిక స్ఫురణ, ధైర్యము కూడ వారికి ఆదర్శం కావాలి.

మామూలుగా మరియమాత పట్ల మనకందరికీ భక్తి వుంటుంది. కాని సంప్రదాయభక్తి చాలదు. మరియు ఆనాటి విమోచనోద్యమంలో పాల్గొంది. ఆనాటి ఘరానా అధికారుల నెదిరించి పీడితులైన దీనప్రజల కోపు తీసికొంది. ఆనాటి పరపీడనం నేడూ లోకంలో కొనసాగుతూనే వుంది. కనుక మరియును ఆదర్శంగా పెట్టుకొని మనం కూడ అన్యాయాలు నెదిరించి పోరాడాలి. అందరికీ న్యాయం జరిగి సమసమాజం ఏర్పడేలా చూడాలి. మన తరఫున మనం ఎవరికీ అన్యాయం తలపెట్టకూడదు. ధీరత్వం, క్రియాపరత్వం, అంకితభావం గల మరియుమాతను చూచి నేటిలోకంలో మనం కూడ ఆ దొడ్డగుణాలను అలవర్చుకోవాలి.

19. మరియు మాతపట్ల భక్తి

పరలోకపిత ఆనాదినుండి మనలను రక్షించాలని సంకల్పించు కున్నప్పుడే క్రీస్తుతోపాటు మరియను గూడ ఎన్నుకున్నాడు. ఆమె క్రీస్తుతో సహకరించి మన రక్షణంలో పాల్గొంది. రక్షణమాత ఐంది. నేడు మోక్షంలో వుండి మనకు అన్ని వరప్రసాదాలూ సంపాదించి పెడుతుంది. మన తరఫున క్రీస్తును మనవి చేస్తుంటుంది. ఆపభువు మళ్లా రెండవమారు విజయం చేయకముందు విశ్వాసులంతా ఆమెపట్ల భక్తి చూపుతారని చాలమంది పునీతులు అభిప్రాయపడ్డారు.


దేవుడే ఆమెను ఎన్నుకొని మన రక్షణమాతనుగా నియు మించాడు. కనుక మనమూ ఆమెను ఎన్నుకొని గౌరవించాలి. ప్రభువు