పుట:Punitha Matha.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేదసాదలూ, విశేషంగా స్త్రీలు మరియను ఆదర్శంగా బెట్టుకొని ఓర్పుతో జీవించాలి అన్నారు. ప్రత్యేకించి కాన్వెంటు నాలుగోడలు దాటి వెలుపలికి వెళ్లకుండా సాంఘిక బాధ్యతలుఏవీ లేకుండా జీవించే మఠకన్యలకు ఆమె ఆదర్శం అని చెప్పారు. ఆమె వినయవిధేయతలూ కన్యత్వమూ వారికి ప్రేరణం కలిగిస్తాయి అనుకొన్నారు. సిస్టర్లు మరియకు ప్రార్ధన చేసి తమ అవసరాల్లో ఆమె నుండి సహాయం పొందాలని కోరారు. మనం చిన్ననాటి నుండి మరియను గూర్చిన ఈలాంటి భావాలకు అలవాటు పడిపోయాం.

కాని నేటి క్రైస్తవవేదాంతులు మరియను ఇలా చిత్రించడం లేదు. వీరి దృష్టిలో మరియు సామాజికబాధ్యతలు నెరిగిన వ్యక్తి. సంఘజీవి. పేదలను ఆదుకొన్న కరుణామయి. ఎన్నో సమస్యల నెదుర్కొని వాటితో నిబ్బరంగా పోరాడిన ధీరవనిత. క్రియాశీల. దేవుని చిత్తానికి కట్టుపడివున్నా తన స్వేచ్చను ఈ క్రింది విధాలుగా సద్వినియోగం చేసికొన్న ఆదర్శ మహిళ.

1. యువతిగా మరియ

దేవదూత మరియకు మంగళవార్త చెప్పాడు. ఆమె గర్భం ధరించింది. కాని ఆ సంగతిని యోసేఫుకి తెలియజేయడం ఎలా? యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లికాకుండానే చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక ఆమె యెంతో ఆందోళనకు గురైయుండాలి. ఆమె మంగళవార్తను గూర్చి విన్న యోసేపు కూడ ఆశ్చర్యచకితుడై యుండాలి. ఇంకా మెస్సీయా బాధలనుభవిస్తాడని మరియకు కొంతవరకైనా తెలుసు. అలాంటి బాధామయ సేవకునికి తను తల్లికావాలి. ఐనా ఆమె దేవద్రూతతో నీమాట చొప్పననేనాకు