పుట:Punitha Matha.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1. నిష్కళంక మాత

సెడూలియస్ అనే ఐదవ శతాబ్దపు ల్యాటిను కవి మరియ మాతను ప్రశంసిస్తూ "సుందరమైన గులాబిపూవు ముండ్లమొక్క మీద ఎదుగుతుంది. అది తల్లి చెట్టుకంటె అందమైంది. తల్లి చెట్టులాగ ముళ్లులేంది కూడ. అలాగే మరియ అనే పూవు కూడ ఏవ అనే ముండ్ల మొక్కమీద వికసించింది. ఈ కన్య దోషరహితయై దోషసహిత యైన ఆ తొలికన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది” అని వ్రాశాడు. ఈ కవి భావించినట్లు మరియ నిష్కళంక ప్రస్తుతం నిష్కళంక మాతను గూర్చి ఐదంశాలు విచారిద్దాం.

1. నిష్కళంకమాత అంటే యేమిటి?

మరియూ మనలాగే పాపపు ఆదాము కుటుంబంలో పుట్టింది. కనుక మనలాగే ఆమెకూ జన్మపాపం సోకాలిసింది. కాని పాపం ఆమెకు సోకలేదు. పరలోకంలోని తండ్రి మరియను జన్మపాపం నుండి పదిలపరచాడు. ఎలాగ? భవిష్యత్తులో జన్మింపబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియను పాపం నుండి పదిలపరచాడు. మనమంతా పాపంలో పుట్టాం. అలా పుట్టినంక, క్రీస్తు ద్వారా ఆ పాపం నుండి రక్షింపబడ్డాం. కాని అదే క్రీస్తు ద్వారా మరియు అసలుపాపానికి గురికాకుండానే పదిలపరచబడింది. నేలమీద జారిపడిన పసిగందును లేవనెత్తడం కంటె, ఆ బిడ్డ అసలు పడకుండా వుండేలా జాగ్రత్తపడ్డం మేలు. పరలోకపిత మరియమాతను కూడ అలా జాగ్రత్తతో పదిలపరచాడు.

కనుక మన రక్షణకంటె ఆమె రక్షణం శ్రేష్టమైంది. ఆమెకు