పుట:Punitha Matha.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాశం జేసింది. క్రీస్తు పరిహారంతో ఐక్యమై మలియేవ పరిహారం మనలను రక్షించింది. యథార్థంగా పాపియేమో ఆదామొక్కడే, రక్షకుడేమో క్రీస్తు ఒకడే. కాని అతనితోను ఇతనితోను ఓ స్త్రీని జోడించడం దేవుని చిత్తమైంది. రక్షణగాథలో ఆ యేవా ఈ యేవా చారిత్రకంగా నిలిచిపోయారు. ఈ యిద్దరు స్త్రీలు నిర్వహించిన పాత్రలను మరచిపోలేం. ఆమె పతనాన్నీ ఈమె ఉద్ధరణాన్నీస్మరింపక తప్పదు. ఈ స్మరణమే మరియమాత పట్ల భక్తినీ గౌరవాన్నీ కలిగిస్తుంది. ఆ తల్లి పట్ల మనం చూపే భక్తి క్రీస్తుకి అప్రియం గలిగించదు. ఆ తల్లిని గౌరవించినపుడు ఆ కుమారునే గౌరవిస్తున్నాం. ఆ తల్లిని అనాదరం చేసినపుడు ఆ కుమారునే అనాదరం చేసినట్లు.

9. ధీరనారి మరియు

క్రీస్తు తర్వాత మరియమాత అంతటి వ్యక్తి లేదు. ఆమె రక్షకుని మాత, మోక్షానికి రాజ్ఞ. తిరుసభకు తల్లి కమన క్యాతలిక్ సమాజంలో స్త్రీలు, మఠకన్యలూ మరియను ఆదర్శంగా పెట్టుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొంటుంటారు. కనుక మరియ ప్రాముఖ్యం అన్ని విధాల గణనీయమైంది.

ప్రాచీన వేదశాస్రులు మరియను గూర్చి సంప్రదాయ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. ఆమె కోమల హృదయ. నిప్రియాశీల. దేవుని వరప్రసాదాన్ని స్వీకరించడం మాత్రమే ఆమె చేసిన పని. ఇంకా ఆమె వినయవతి. దేవుని చిత్తప్రకారం జీవించిన భక్తురాలు. సహనశీల. బాధామయురాలు. విశుదురాలు, నిత్యకన్య, ప్రార్ధనామంు. కరుణాపూరిత. పూర్వరచయితలు మరియను చిత్రించిన తీరు ఇది.