పుట:Punitha Matha.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందిన పరాభవానికి క్రుంగిపోయింది. "ఆనాడు ఆ కన్యనుమోసగించి నేను పాముకుంది మాత్రం ఏముంది? మెదలకుండా వున్నా బాగుండేది గదా" అని విచారించింది. పిశాచం దేవుడు ఓడిస్తే ఓర్చుకుంటుంది గాని కేవలం ఓ సృష్టి ప్రాణి ఓడిస్తే ఓర్చుకోలేదు గదా! ఐనా మరియ మాత ఓడించందే పిశాచంటటమి పూర్తి వోటమి కాజాలదు. ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని జయించి ఆనాడు తాను పూర్తిగా నెగ్గింది. మళ్లా ఒక పురుషుడూ ఒక ప్రీ జయిస్తేనే గాని దానికి పూర్తిగా శృంగభంగం జరగదు.

తొలి ఆదాము పాపంచేశాడు. అతడు నరజాతికి శిరస్సు కావున అతని పాపం మనకూ సంక్రమించింది. కాని ఆ తొలి ఆదాము పాపంలో ఓ & కూడ పాల్గొంది. ఏవ మన తలగాదు గనుక ఆమె పాపం తనంతట తాను మనలను నాశంజేసి వుండదు. కాని ఆదాము పాపంతో గూడి ఆమె పాపంగూడ మనకు నాశం దెచ్చి పెట్టింది. ఇక ఒక పురుషుడు ఒక స్త్రీ మనకు నాశం దెచ్చిపెట్టినట్లే, మళ్లా ఒక స్త్రీ ఒక పురుషుడు మనకు రక్షణం దెచ్చిపెట్టారు. ఏవ మన పతనంలో పాల్గొన్నట్లే మరియు మన ఉద్ధరణంలో పాల్గొంది. మరియ తనంతతాను మనలను రక్షించి వుండలేదు. ఆమె మన తలగాదు. రక్షకుడేమో క్రీస్తే. కాని క్రీస్తు రక్షణంలో తానూ పాల్గొనడం వల్ల క్రీస్తుతో, క్రీస్తునందు తానూ మన రక్షకి అని చెప్పబడుతుంది.

నేడు మనం మరియమాతను గౌరవిచడంలో ఉద్దేశం ఇది తొలియేవ మన పతనంలో పాల్గొన్నట్లే మలియేవ మన ఉద్ధరణంలో పాల్గొంది. ఆదాము పాపంతో గలిసి తొలి యేవ పాపం మనలను