పుట:Punitha Matha.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ తల్లి అవిధేయత వలన దేవుని యాజ్ఞమీరి తనకూ మనకూ చావు తెచ్చిపెట్టింది. ఈ తల్లి విధేయత వలన దేవుని యాజ్ఞకు బద్ధురాలై తనకూ మనకూ గూడ జీవం తెచ్చిపెట్టింది. ఆమె అవిధేయవతి, ఈమె విధేయవతి.

ఆ కన్యతన పాపం ద్వారా మన గొంతుకు ఉరిపెట్టి పోయింది. మరో కన్య ఈ వురి విప్పింది. ఆ కన్య పాపాత్మురాలు అనబడుతుంది. ఆ తొలికన్య పాపానికి ఈ మలికన్య పరిహారం చేసింది. ఆ తొలికన్య తప్పిదం క్షమించమని ఈ మలికన్య దేవుని మనవిచేసింది. ఆమెకు తగిలిన శాపాన్ని ఈమె తీర్చింది. కనుక ఆమె యీమెను తన రక్షక్రిగా భావిస్తుంది.

పిశాచం ఆ తొలిస్త్రీని వంచించింది. యేవ మోసపోయింది. ఆమె పిచ్చిదై పిశాచం పలుకులు స్వీకరించింది. హృదయంలో నిల్పుకుంది. తన కడుపులో విషం తాల్చింది. కాని ఈ రెండవ ప్రీ పిశాచం పలుకులకు మోసపోలేదు. ఈమె గబ్రియేలుదూత పలుకులను స్వీకరించింది. తన హృదయంలో నిల్పుకుంది. తన గర్భంలో జీవాన్ని ధరించింది. ఆ స్త్రీ మనకు విషాన్ని అందించింది. కాని ఈ స్త్రీ అమృతాన్ని ప్రసాదించింది.

నాడు ఆ తోటలో చెట్టదగ్గర నిలుచుండి సైతాను మాటలకు మోసిపోయింది ఆ తెలివి తక్కువ కన్య మళ్లా మరోచెట్టు దగ్గర, అనగా సిలువ చెంత నిలుచుండి సైతానుని జయించింది ఈ తెలివిగల కన్య. ఆనాడు సైతాను కన్య పాదం కరిచింది. ఈనాడు ఈ కన్య సైతాను తలనే కాలితో నలగ ద్రౌక్కింది. పిశాచం ఆనాడు తాను పొందిన విజయాన్ని తలచుకొని పొంగిపోయింది. కాని ఈనాడు తాను