పుట:Punitha Matha.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియు యెప్పుడూ క్రీస్తుతో పోటీ పడదు. తాను ఆ ప్రభు కార్యాన్ని కొనసాగిస్తుంది, అంతే. కనుక క్రీస్తు ఉన్న కాడ మరియు ఉండక తప్పదు. మరియపట్ల భక్తి చూపడానికి ఇష్టపడనివాళ్లు ఆమె స్థానాన్ని అర్ధం చేసికొనే ప్రయత్నం చేయడం లేదనే చెప్పాలి.

పూర్వవేదపు పుణ్యస్త్రీలను చాలమందిని గూడ మరియకు ఉపమానంగా చెప్పారు. ప్రస్తుతానికి ఒక్క ఉపమానాన్ని చూద్దాం. పర్షియా రాజు యిస్రాయేలు ప్రజలను నాశం చేయబోతుండగా ఎస్తేరురాణి ఆ ప్రభువును మనవిచేసి తన జనులను కాపాడింది. అలాగే మరియ కూడ మోక్షంలో ప్రభు సన్నిధిలో మనకోసం మనవి చేస్తుంది. ఆ ప్రభు కోపం తొలగిస్తూంటుంది.

ఫలితార్ధమేమిటంటే అన్నివరప్రసాదాలు పిత నుండి క్రీస్తుకూ, క్రీస్తు నుండి మరియుకూ, మరియు నుండి విశ్వాసులకూ సంక్రమిస్తాయి. దేవుడు మరియను ఈలా వరప్రసాద ప్రదాయిని చేయడం అవసరమై గాదు. ఔచిత్యంకోసం. ఇది దేవుడేర్పరచిన నిర్ణయం. ఈ నిర్ణయానికి తిరుగులేదు.

3. భక్తి భావాలు

తూర్పుదేశపు జ్ఞానులు ప్రయాణమై వచ్చి తల్లి మరియను ఆమెతో వున్న బిడ్డను చూచారట -మత్త 1,11. సువిశేషం చెప్పదుగాని, ఆ తల్లి క్రీస్తు శివువుని వాళ్లకు అందించి వుంటుంది. జ్ఞానులు ఆ శిశువును ముద్దిడుకొని ఆరాధించి వుంటారు. అప్పటి నుండి శ్రీసభలో ఆమె స్థానం, క్రీస్తు శిశువుని క్రైస్తవ ప్రజలకు అందిస్తూండడమే. మన తరఫున మనం, ఆజ్ఞానుల్లాగే, మరియద్వారా గాని క్రీస్తును చేరలేం.


అడగందే అమ్మైనా పెట్టర్త్ను మనం బిడ్డల్లాగ ఆ తల్లి చెంతకు