పుట:Punitha Matha.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాదు, సమైక్యతకు దోహదం చేయాలనే గ్రంథకర్త ఆశయం. క్రీస్తు జననియైన మరియు క్రైస్తవ ప్రజను ఐక్యం చేస్తుందిగాని విభజించదు.

మామూలుగా క్యాథలిక్ క్రైస్తవులకు మరియమాత పట్ల గాఢభక్తి వుంటుంది. కాని ఈ భక్తి తరచుగా అర్ధం లేని మూఢభక్తి ఐపోతూంటుంది. ఈ గ్రంథంలో దేవుని రక్షణ ప్రణాళికలో మరియకున్న స్థానమేమిటో శాస్త్రద్ధృష్టితో వివరించి చెప్పాం. ఈ పుస్తక పఠనం వలన మన ప్రజల మరియుభక్తి పూర్వంకంటె అర్ధవంతమూ ఫలభరితమూ ఐనట్లయితే ఈ గ్రంథకర్తకు అదే పదివేలు.

ఈ గ్రంథాన్ని గుంటూరు మాజీ వీఠాధిపతి శ్రీ ముమ్మడి ఇగ్లేప్యస్ ఏలినవారికి అంకితం చేశాం.

మా పూర్వగ్రంథాలకు వలెనె ఈ పుస్తక ప్రచురణకు గూడ ఆర్థిక సహాయాన్ని అందించిన రెవ. డోక్టరు ఇంజే పౌలుగారికి కృతజ్ఞతలు. - గ్రంథకర్త