పుట:Punitha Matha.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ తల్లికి అర్పించుకోవాలి. మన జపతపాలు భక్తి క్రియలు, పుణ్య కార్యాలు ఆ రాజ్ఞకి కానుక పెట్టాలి.


ఈ రాజ్ఞకి పిశాచం శత్రువు. ఆమె పిశాచంతల నలగ ద్రౌక్కుతూంటుంది. నిత్యం పోరాడి ఆ పిశాచాన్ని నరకానికి తరమి వేస్తూంటుంది. ఇటువంటి పిశాచాన్ని మనం సేవించకూడదు. దానితో చేతులు కలపనూ కూడదు. మనం పాపం చేసేప్పుడూ, దురభ్యాసాలకు లొంగిపోయేవ్పడూ ఆ రాజ్ఞని సేవించకుండా పిశాచాన్ని సేవిస్తుంటాం. అది ఆ తల్లికి కోపాన్నీ దుఃఖాన్నీ కలిగిస్తుంటుంది.


ఆమె రాజ్జీత్వం మనకోసం విజ్ఞాపనం చేయడమే అన్నాం. మనకు వరప్రసాదాలు ఆర్జించి పెట్టడమే అన్నాం. అంచేత ఆమె ప్రార్ధనం మీద మనకు నమ్మకం వుండాలి. అవసరాల్లో ఆ తల్లిని అడుగుకోవడం నేర్చుకోవాలి. నమ్మికతో ఆమె మీద భారం వేసి జీవించడానికి అలవాటు పడాలి. పన్నెండవ శతాబ్దంలోనే బెర్నార్డు భక్తుడు ఆమెనుద్దేశించి "తల్లీ! § శరణుజొచ్చి, నీ సహాయమడిగి, నీ వేడుకోలును కోరుకున్నవాళ్లల్లో నిరాశ చెందినవాడు ఒక్కడూ లేడు" అని సవాలు చేశాడు. ఈ సవాలు మనకు ధైర్యాన్ని ఆశనూ కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతూండాలి.


7.వరప్రసాద మాత

15వ శతాబ్దపు భక్తుడు సియన్నా బెర్నడీను మరియను గూర్చి చెపూ " అన్ని వరప్రసాదాలూ పితనుండి క్రీస్తుకూ, క్రీస్తు నుండి మరియకూ, మరియు నుండి శ్రీసభకూ లభిస్తాయి. కనుక అన్ని వర ప్రసాదాలూ మరియు ఆధీనంలో వుంటాయి. ఆ వరప్రసాదాలను ఆమె