పుట:Punitha Matha.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిత, సుతుడు, ఆత్మ - ఈ మువ్వరు దైవవ్యక్తులూ ఆమెను రాజ్జిగా నియమించి కిరీటం వుంచారు. శ్రీసభ ఆమెను రాజ్జిగా ఎన్నుకొని మరియరాజ్జి మహోత్సవం అనే పండుగను నెలకొల్పింది. ఆమె రాజ్యం క్రీస్తు రాజ్యమంత విస్తీర్ణమైంది. భూమిమీద, ఉత్తరించే స్థలంలో కూడ ఆమె రాచరికం చెల్లుతుంది. ఆ రాజ్ఞ నరకంలోని పిశాచాలకు గర్వభంగం కలిగిస్తుంది. దేవునికి ఓడిపోతే పొయ్యాంగాక, ఈ సృష్టి ప్రాణికి కూడ ఓడిపోయాంగదా అని పిశాచాలు సిగ్గుతో వ్రుగ్గిపోతాయి. మోక్షంలోని పూర్వ నూత్న వేదాల పునీతులకూ, దేవదూతలకూ మరియ రాజ్ఞ ఔతుంది. ఈ విధంగా భూమి మీద, మోక్షంలో, నరకంలో - అంతటా ఆమె ప్రాభవం చెల్లుతుంది. క్రీస్తు ఎన్నాళ్లు ఎంత వైభవంగా రాజ్యపాలనం చేస్తాడో ఆమెకూడ అన్నాళ్లు, అంత వైభవంగా రాజ్జిగా ఉండిపోతుంది. ఆ కుమారుడు ఆ తల్లి పరిపాలించే రాజ్యానికి అంతమే వుండదు.


క్రీస్తు రాజు అన్నాం. కాని ఆ ప్రభువు రాచరికం అధికారం చెలాయించడం కోసం గాదు, సేవచేయడం కోసం. "మనుష్య కుమారుడు సేవలు చేయించుకోవడం కోసం గాదు, సేవలు చేయడం కోసం వచ్చాడు" -మార్కు 10,45. ఈ క్రీస్తురాజు లాగే మరియరాజ్ఞ కూడ మనకు సేవలు చేస్తుంది. మరియు సేవ ఆమె వేడుకోలే. ఇక క్రీస్తురాజుతో పాటు మనమూ రాచరికం చేస్తాం. క్రీస్తురాజుతో పాటు, మరియు రాజ్ఞతో పాటు మనమూ పరిపాలనం చేస్తాం -2తిమొు 2, 12. ఆ ప్రభువుని ఆరాధించి సేవించడమే రాచరికం.


3. భక్తి భావాలు

మరియరాజ్జిని మనం సేవిస్తుండాలి. మన పనులు కష్టసుఖాలు