పుట:Punitha Matha.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్గంలో ఉండి అహోరాత్రులూ మన రక్షణకోసం క్రీస్తుని మనవి చేస్తుంది. మనం పిశాచం చేతుల్లో చిక్కుకోకుండా వుండేలా తోడ్పడుతుంది.

ఈలా మరియ క్రీస్తు జననమందు, కల్వరిచెంత, మెక్షం నుండి మన రక్షణంలో పాల్గొంది. క్రీస్తుతో పాటు ఆమె కూడ మనలను రక్షించింది. కావున మరియు సహరక్షకి, రక్షణమాత.

3. రక్షణమాతపట్ల భక్తిభావాలు

మరియ క్రీస్తు శిశువును ప్రేమించినంతగా భూ లోకంలో ఏ తల్లి కూడ తన బిడ్డను ప్రేమించి యెరుగదు. ఐనా ఈ మరియు తన బిడ్డను మన రక్షణకోసం అర్పించడానికి వెనుదీయలేదు. ఈలాగే క్రైస్తవ తల్లిదండ్రులు కూడ తమ బిడ్డలను క్రిస్తు సేవకు సమర్పించడానికి వెనుకాడకూడదు.

క్రీస్తు జన్మించినపుడూ చనిపోయేప్పుడూ ఆ ప్రభుని మరియు పరలోక పితకు అర్పించిందన్నాం. నేడు మనం కూడ పూజలో క్రీస్తుని భక్తితో పరలోక పితకు అర్పించుకునే భాగ్యంకోసం వేడుకుందాం.

మరియ గర్భసీమలో గోదుమ పైరు పంటపండింది. ద్రాక్ష పండ్లు కాసింది. ఆ తల్లి మనకు స్వర్గపు రొట్టెను స్వర్గపు రసాన్నిఅందిస్తుంది. ఈ రొట్టెను భుజించి ఈ రసాన్ని పానం చేసి ఆకలి తీర్చుకుందాం, సంతృప్తి చెందుదాం.

మరియు రక్షణమాత. కనుక ఆమెను మన కోసం మనవి చేయమందాం. అశ్రద్ధవల్ల మనమాతల్లిని మరచి పోయినా ఆ తల్లి మాత్రం మనలను మరచిపోకుండా వుండాలని విన్నవించుకొందాం. L