పుట:Punitha Matha.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వారా క్రీస్తుతోపాటు తనూ మన రక్షణంలో పాల్గొంది. మరియు సహకారం ద్వారా క్రీస్తు స్త్రీ పురుషుల పాపాలకుగూడ పరిహారం చేసినట్లయింది.


మరియు తొలిబిడ్డను కన్నపుడు ఏ బాధా అనుభవించ లేదు. కాని కల్వరి మీద మలిబిడ్డలమైన మనలను కన్నపుడు ఎంతైనా బాధ అనుభవించింది. "ఇదిగో నీ కుమారుడు" అని క్రీస్తు నుడివినపుడు, ఆ ఆమాటల ద్వారా జ్ఞానవిధంగా తాను మనకు తల్లి ఐనపడు, మరియ పుట్టెడు దుఃఖం అనుభవించింది. ఈలా ఆమె బాధామయమాతగానే మన రక్షణంలో పాల్గొంది.


ఈలా క్రీస్తుతోపాటు మన రక్షణంలో పాల్గొనేందుకే మరియ నిష్కల్మషగా పవిత్రురాలుగా పదిలపరచబడింది. తానే పాపాత్మురాలై నట్లయితే మన రక్షణంలో పాల్గొని వుండలేదు. తొలిస్త్రీ పాపాత్మురాలై మన నాశంలో పాల్గొంది. ఈ రెండవ ప్రీ పునీతురాలై మన రక్షణంలో పాల్గొంది.


మూడవది, మరియు మోక్షం నుండి గూడ మన రక్షణంలో పాల్గొంటుంది. ఆమె ఈ లోకంలో వుండగా నరులకు సాయపడింది. ఆమె సాన్నిధ్యం ద్వారా యెలిసబేతు గర్భం లోని యోహాను పునీతు డయ్యాడు -లూకా 1,44. ఆమె వేడుదల ద్వారా ప్రభువు కానావూరిలో నీరు ద్రాక్షసారాయంగా మార్చాడు. యెరూషలేము మీది గదిలో ఆమె శిష్యులు పరిశుద్ధాత్మను పాండాలి అని ప్రార్ధనం చేసింది -అచ 1,44. ఈలా భూమిమీద జీవించివున్నపుడు నరులకు సాయపడుతూ వచ్చిన మరియ మోక్షంలో వుండి మాత్రం మనలను మరచిపోతుందా? ఆమె