పుట:Punitha Matha.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియకూడ మనుష్యా వతారానికి సమ్మతించింది. ఈ సమయంలో ఆమె మానవులందరికీ ప్రాతినిధ్యం వహించింది. అనగా దేవుణ్ణి మానవ లోకంలోకి తీసికొని రావడానికి మనందరితరఫున ఒప్పకుంది. ఇక్కడ ఆమె చూపిన బాధ్యతా, అంగీకారమూ చాల గొప్పవి.

క్రీస్తు ఆమెనుండి జన్మించాడు గదా? మరియ క్రీస్తుకి ఓ మానుష దేహాన్ని అర్పించింది. తరువాత ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద పితకు బలిగా అర్పించాడు. కనుక పూజలో గురువు రొట్టె, రసం ෂඹී కానుకలను సమర్పించినట్లే మరియకూడ దైవవార్తకు మానుషదేహం సమర్పించింది. ఈ బలివస్తువు వలననే కల్వరియోగం నిర్వ హింపబడింది.

ఆ తల్లి బలికై గొర్రెపిల్లను సంసిద్ధం చేసింది. లోకపు పాపాలకు పరిహారం చేయడం కోసమై ఈ గొర్రెపిల్ల సిలువమీద చనిపోయింది. ఈ రీతిగా మరియు క్రీస్తు జననం ద్వారానే మన రక్షణంలో పాల్గొంది. భక్తుడు ఆంబ్రోసు నుడివినట్లు, మరియు రక్షకుణ్ణి కనడం ద్వారానే మన రక్షణాన్ని కూడ కంది.

రెండవది, మరియు కల్వరిమీద మన రక్షణంలో పాల్గొంది. ఆమె కల్వరి కొండమీద క్రీస్తుతో పాటు తానూ బాధలు అనుభవించింది. అతని నెత్తుటితో తన కన్నీటి బొట్లను మేళవించింది. అతనితో పాటు తానూ ఇంచుమించుగా చనిపోయింది. తల్లి హక్కులన్నిటినీ విడనాడి క్రీస్తును పరలోకపితకు ఆర్పించింది. సిలువమీద ఓ బలి అర్పింప బడుతూంటే ఆమె హృదయంలో కూడ ఓ బలి అర్పింపబడింది. ఈలా క్రీస్తును కల్వరికొండ మీద పితకు అర్పించింది. మరియ ఈ యర్పణం I